ఆంధ్రప్రదేశ్‌

రైతుల్ని ముంచేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, సెప్టెంబర్ 27: పిల్లనిచ్చిన మామ ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబునాయుడుదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. మంగళవారం జగన్ గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని కొండమోడు, అనుపాలెం, బెల్లంకొండ, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాల్లో వరద ముంపునకు గురైన పొలాలు, బ్రిడ్జిలు, నర్సరీలు, గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్డిగూడెంలో జెండాచెట్టు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హెలికాప్టర్‌లో వచ్చి కాలు కిందపెట్టకుండా, వరద బాధితులను పరామర్శించకుండా టివిల్లో కనిపించడానికి మాత్రమే ప్రయత్నించారన్నారు. వరదలు వచ్చి ఆరు రోజులైనా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదని, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రెడ్డిగూడెం గ్రామంలో వరద బాధితులకు బియ్యం, చీరలు, నిత్యావసర వస్తువులు, సరుకులు అందించారన్నారు. చంద్రబాబు రైతులకు రుణాలు ఇప్పించక పోగా బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టుకున్న డబ్బులను కూడా ఇవ్వవద్దని బ్యాంకర్లకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. అదేవిధంగా మార్గమధ్యలోని అనుపాలెం గ్రామంలో వరద బాధిత మహిళలతో మాట్లాడుతూ మీ సమస్యలను చెప్పాలని అడగ్గా... మా గ్రామంలో ఇళ్లు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాపోయారు. మీ గ్రామ సర్పంచ్ ఎవరని పిలవడంతో సర్పంచ్ కోటినాగిరెడ్డి నా మీద వైసిపి ముద్ర వేసి నన్ను ఎలాంటి అభివృద్ధి పనులు చేయనీయడం లేదని, చేసిన పనికి 10 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా టిడిపి నాయకులు బిల్లులు చెల్లించకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సిపి అధికారంలోకి వచ్చాక వరద ముంపునకు గురైన గృహాలన్నింటినీ తిరిగి నిర్మిస్తామన్నారు. కొండమోడు, అనుపాలెం, బెల్లంకొండ అడ్డరోడ్డు, రాజుపాలెం గ్రామాల్లో జగన్‌కు ఘన స్వాగతం లభించింది. పర్యటనలో సత్తెనపల్లి సమన్వయకర్త అంబటి రాంబాబు, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రాజుపాలెం మండలంలో జరిగిన సభలో మాట్లాడుతున్న జగన్