ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే మదన్‌కు వైకాపా గాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 26: కేంద్ర మాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్ ఇటీవలే సైకిలెక్కడంతో ఆయన క్లాస్‌మేట్, సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి.మదనమోహన్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. మదనమోహన్‌రెడ్డితో ఇప్పటికే వైకాపా అధిష్ఠానం పలుమార్లు సంప్రదింపులు చేసినట్లు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రాజంపేట అసెంబ్లీ వైకాపా ఇన్‌చార్జి బాధ్యతలు కూడా డాక్టర్ పి.మదన్‌మోహన్‌రెడ్డికి అప్పగిస్తామని చెప్పినట్లు వినికిడి. ఈ మేరకు ఆయన శనివారం రాజంపేట, వీరబల్లి, సుండుపల్లె, రాయచోటి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించి తనకు పరిచయమున్న నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపారు. అందులో భాగంగానే టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి ఎస్.పాలకొండ్రాయుడును శనివారం మర్యాదపూర్వకంగా కలిసి నేటి రాజకీయాలపై పిచ్చాపాటిగా మాట్లాడారు. అయితే పాలకొండ్రాయుడు మాత్రం తన చివరి రక్తపు బొట్టు వరకూ టిడిపిలో కొనసాగుతానని, 2018లో తన రాజకీయ భవిష్యత్తుపై బహిరంగంగా ప్రకటిస్తానని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. సుండుపల్లె, వీరబల్లి మండలాలు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండటంతో పాలకొండ్రాయుడుకు బలమైన వర్గం ఉండటం కారణంగా మదన్‌మోహన్‌రెడ్డి రాయచోటిలో రాయుడు అనుచరులతో కలిసినా వారు కూడా తమది రాయుడు బాటే అని తెగేసి చెప్పారు. అయితే మదన్ మాత్రం వైకాపాలో చేరుతున్నట్లు బహిర్గతం చేయలేదు. కానీ సాయి ప్రతాప్‌పై, టిడిపిపై విమర్శలు గుప్పించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మదన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ కుటుంబాలు ఆ నియోజకవర్గానికే పరిమితమై ఒక వెలుగు వెలుగుతూ వచ్చారు. రాజంపేట పార్లమెంట్‌లో వైకాపాకు బలమైన నేతలు కరవవుతున్న తరుణంలో మదన్ మోహన్‌రెడ్డికి గాలం వేశారు. ఆయన కూడా వైకాపాలోకి వెళ్లడం తన రాజకీయ వారసులకోసమేనని తెలుస్తోంది.