ఆంధ్రప్రదేశ్‌

జీవిత కాలం జైలులోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 28: ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు ఇక సభ్యసమాజంలో తిరుగాడే అర్హత కోల్పోయాడని, జీవించి ఉన్నంతకాలం జైలులోనే గడపాలని కర్నూలు కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. కర్నూలు నగరానికి చెందిన పఠాన్ ఖాజాఖాన్(25)కు ఈమేరకు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఖడక్‌పూరావీధికి చెందిన పఠాన్ ఖాజాఖాన్ గత ఏడాది జూలై 18న పక్కింట్లో నివాసం ఉండే ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి వెంటతీసుకువెళ్లాడు. మూడు రోజులపాటు బాలికను మరోచోట నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిచూడగా ఆ చిన్నారి అపస్మారకస్థితిలో కనిపించింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న నిందితుడు ఖాజాఖాన్‌ను అరెస్టు చేశారు. అప్పటికే మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు దాన్ని కాస్త అత్యాచారం, లైంగిక వేధింపులు, కిడ్నాప్ సెక్షన్ల కేసుగా మార్చారు. ఏడాది పాటు ఈ కేసు విచారణ జరిగింది. బుధవారం తుది విచారణ జరిగింది. నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్ధారించిన కోర్టు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించి ఓ బాలిక జీవితాన్ని నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు ఖాజాఖాన్ జీవితాంతం జైలులోనే గడపాలని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి తీర్పు చెప్పారు. దీంతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. బాలికను అపహరించిన నేరానికి నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష, మరో రూ.1000 జరిమానా విధించారు. కేసు తీర్పు వెలువడగానే కోర్టు ఆవరణలో వేచిఉన్న బాధితురాలి బంధువులు, మహిళలు, న్యాయవాదులు, పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.