ఆంధ్రప్రదేశ్‌

గుంటూరులో టిడిపి రాష్ట్ర కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 26: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు గుంటూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న తరుణంలో పార్టీ కార్యాకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగించాలనే తలంపుతో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. శనివారం పార్టీ హైకమాండ్ నుంచి పరిశీలకులుగా నాయకులు సాంబశివరావు, పార్టీ సాంకేతిక విభాగం సభ్యుడు రాజేష్ తదితరులు జిల్లాపార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పార్టీ కార్యాలయం ఇప్పటికే తెలంగాణ పార్టీ కార్యాలయంగా రూపుదిద్దుకుంటున్న దశలో నూతన రాష్ట్రానికి పార్టీ కార్యాలయ అవసరాన్ని గుర్తించిన నారా లోకేష్ తన అనుయాయుల ద్వారా సంపూర్ణ సమాచారాన్ని సేకరించారు. గుంటూరు పార్టీ కార్యాలయం అందుకు అనువుగా ఉన్నట్లు భావించి లోకేష్ దాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్పు చేసేందుకు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు రాష్టప్రార్టీ కార్యాలయం నుంచి పరీశీలనకు వచ్చి భవన నిర్మాణం, వాస్తు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే స్థల సదుపాయం, వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు వచ్చే వారికి వసతి సదుపాయం, రాకపోకలు సాగించే వారికి అనువైన వాతావరణం ఉందా, లేదా అనే అంశంపై కూలంకషంగా పరిశీలించారు. జిల్లా పార్టీ నాయకులు మాత్రం గుంటూరు కేంద్రంగా రాష్టప్రార్టీ కార్యాలయం కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి నారా లోకేష్ వచ్చిన సందర్భంలో పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపి రాయపాటి సాంబశివరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు తదితరులు తమ అభిమతాన్ని విన్నవించారు. రాష్ట్రానికి మధ్యలో గుంటూరు జిల్లా ఉన్నందునే రాజధానిని ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభించేందుకు సూత్రప్రాయ అంగీకారానికి లోకేష్ వచ్చినట్లు నాయకులు చెబుతున్నారు.