ఆంధ్రప్రదేశ్‌

దశలవారీగా ‘ఇ-ప్రగతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పరిపాలనను అందించేందుకు ‘ఇ-ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శాసనసభలో శనివారం ఇ-ప్రగతిపై ఒక ప్రకటన చేస్తూ, ప్రజలకు వివిధ రంగాలకు సంబంధించి 745 సేవలను అందించాలన్నదే ఇ-ప్రగతి లక్ష్యమన్నారు. ఇ-ప్రగతిని మూడు దశల్లో అమలు చేస్తున్నామని, తొలిదశలో సచివాలయంలోని 10 శాఖలు, వాటికి అనుబంధంగా ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌లలో అమలు చేస్తున్నామన్నారు. రెండో దశలో మరో 10 శాఖల్లో, మిగతా 33 శాఖలలో మూడో దశలో ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. మొదటి దశలో 72 ప్రాజెక్టులు ఉంటాయని, 14 ప్యాకేజీలుగా సంబంధిత శాఖలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. తొలిదశ ఇ-ప్రగతి 2017 సెప్టెంబర్ వరకు పూర్తవుతుందని వివరించారు. గుర్తించిన సేవల్లో చాలా వరకు మొబైల్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ చేపట్టే ప్రతి పనిని ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామని, దీనివల్ల అర్హులకే లబ్ది చేకూరుతుందని వివరించారు. అందరినీ అక్షరాస్యులను చేయడం, ఇ-లిట్రేచర్ సాధించడం, (శారీరక దారుఢ్యం) ఫిజికల్ లిట్రసీని ప్రజలకు వివరించి, అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.