ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఎ చట్ట ప్రకారమే పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: రాజధాని నగర నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూముల్లో చేపట్టే నిర్మాణాలు, పనులన్నీ సిఆర్‌డిఏ చట్ట పరిధికి లోబడే చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు ఇష్టానుసారంగా లీజులుకు ఇస్తున్నారన్న మాట వాస్తవం కాదని అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు 99 ఏళ్లపాటు భవనాలను లీజుకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం నష్టపోతోందని సభ్యులు తెలిపారు. సిఆర్‌డిఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకుందో ఆ మేరకు మాత్రమే వ్యవహరిస్తున్నామని, ఎవరికీ లీజుకు ఇవ్వడం లేదని మంత్రి చెప్పారు.
పర్యాటక ప్రాంతంగా కనిగిరి రిజర్వాయర్
ప్రకాశం జిల్లా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. చెరువు కట్ట నిర్మించాలనే ప్రతిపాదన ఏదీ లేదని అన్నారు. సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం చెప్పారు.
కోవూరు నియోజకవర్గంలో వంతెన నిర్మిస్తాం
కోవూరు నియోజకవర్గంలో మురుగు కాలువ ఆధునీకరణ, వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇటీవలే అందాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆమోదం లభించగానే పనులు చేపడతామని సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
‘ఎన్టీఆర్ జలసిరి’ కింద 12,086 బోరు బావులు
‘ఎన్‌టిఆర్ జలసిరి’ పథకం కింద ఇప్పటి వరకు 12,086 బోరు బావులు తవ్వగా, వాటిలో 9707 బోరు బావులు విజయవంతమయ్యాయని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాల వీరాంజనేయ స్వామి, ఆర్.జితేంద్రగౌడ్, కె.ఈరన్న తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, 1498 బోరు బావులకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, ఇంకా 2515 బావులకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. ‘ఎన్‌టిఆర్ జలసిరి’ రెండో దశ కింద 13 జిల్లాల్లో 1,24,349 కొత్త బోరు బావులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి చెప్పారు.
ఎన్‌ఎస్‌పి కుడికాలువ నుంచి తాగునీరు విడుదల
తాగునీటి ప్రయోజనం కోసం ఎన్‌ఎస్‌పి కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన ప్రతిపాదన ఉందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సభ్యులు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ మూడవ విడతగా ఈ ఏడాది మార్చి నుంచి 2.512 టిఎంసిల నీటిని తాగునీటి అవసరాలకు వదలడం జరుగుతుందని చెప్పారు. ఇంతకు ముందు విడుదల చేసిన రెండు విడతలు కలిపి మొత్తం 12.323 టిఎంసిల నీటిని వదిలినట్లు మంత్రి సభకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు.