ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో పరిశుభ్ర ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 2: రాష్టమ్రంతా 2018 సంవత్సరం నాటికి పరిశుభ్రంగా ఉండేలా తమ ప్రభుత్వం రాజీలేని విధానాలను అమలుచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా 110 మునిసిపాలిటీలలో ఓడిఎఫ్ సాధించిన నేపథ్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో 13 జిల్లాల సర్పంచులు, నగరపాలక, మునిసిపల్ మేయర్లు, చైర్మన్లతో ప్రత్యేక సభలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్ర్తీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 208 రోజులు 2811 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామన్నారు. ముఖ్యంగా తాను రోడ్డుపై వాహనాల్లో ప్రయాణిస్తున్నపుడు ప్రజలకన్నా ముందు రోడ్డుపై ఉన్న మలమూత్రాలు, చెత్తాచెదారాలు స్వాగతమిచ్చాయన్నారు. తాను ఆ రోజే పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ఈనేపథ్యంలో మహాత్మాగాంధీ కలలుకన్న స్వచ్ఛ్భారత్‌ను ఏర్పాటుచేయాలని 2014వ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించి ఒక స్వచ్ఛ్భారత్ మిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఇందులో దేశంలోని 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక స్వచ్ఛ్భారత్ కమిటీని వేశారన్నారు. ఆ కమిటీకి తనను కన్వీనర్‌గా నియమించారన్నారు. జాతీయ స్థాయిలో అనేక సమావేశాలు నిర్వహించి స్వచ్ఛ్భారత్‌ను సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను ప్రధానికి అందజేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి 7200, పట్టణాల్లో 4000 రూపాయలు ప్రకటించిందన్నారు. దానికి అదనంగా తాను గ్రామీణ ప్రాంతాలకు 7800, పట్టణాల్లో 11 వేల రూపాయలు ఇచ్చి 15 వేలతో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానన్నారు. 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలో ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్డి ఉండాలని, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని మోదీ నిర్దేశించారన్నారు. అయితే ఈ ఘనతను ఆంధ్రప్రదేశ్ 2016 అక్టోబర్ 2 నాటికే పూర్తిచేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈక్రమంలో 1365 గ్రామాలు, 110 మునిసిపాలిటీల్లో ఓడిఎఫ్ సాధించామన్నారు. ఇందుకు సర్పంచ్ దగ్గర నుంచి నగరపాలక సంస్థ మేయర్లు, మునిసిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, ఆప్రాంత ప్రజాప్రతినిధులు విశేషంగా కృషి చేశారన్నారు. అన్ని గ్రామాల్లో సిమెంటురోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తామన్నారు. పట్టణాల్లో మురుగునీటిని కూడా శుద్ధి చేసే కార్యక్రమంపై దృష్టి సారిస్తున్నామన్నారు. సింగపూర్‌లో మురుగునీరును శుద్ధిచేసి తాగునీటిగా ఉపయోగిస్తున్నారన్నారు. తాను అక్కడికి వెళ్లినపుడు సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని అలా తయారుచేస్తున్న నీటిని తన ముందు తాగి చూపించారన్నారు. పరిశుభ్రతకు ప్రతిఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. మెరుగైన ఆరోగ్యముంటే పనితీరు కూడా అంత మెరుగ్గా ఉంటుందన్నారు. అందుకే ప్రతి శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. రోజుకు లక్ష మందికి పైగా శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వస్తున్నా అక్కడ ఉన్న పరిశుభ్రత దేశానికే ఒక మార్గదర్శకమని సాక్షాత్తూ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని సిఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టామని, దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రతి శనివారం ఈ పుస్తకంలో ఉన్న అంశాలపై చదివిపించి ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు వివరంగా తెలియజేసే చర్యలు చేపడతామన్నారు. విద్యార్థులు కూడా తమ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి అక్కడ ప్రజలకు చైతన్యం కల్పించి మరుగుదొడ్లు నిర్మింపచేస్తే వారికి బోనస్ మార్కులు వేయిస్తామన్నారు. విద్యుత్ ఆదా చేయడంతో పాటు పేదలకు విద్యుత్ చార్జీల భారం లేకుండా ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటుచేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిశుభ్రతకు సంబంధించి పలు పుస్తకాలను ఆవిష్కరించారు. పరిశుభ్రతపై యుద్ధం ప్రకటించి ప్రభుత్వ సహకారంతో ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకొని ఆరోగ్య పరిరక్షణకు కంకణబద్ధులు కావడమే మనముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.
ప్రతిజ్ఞ చేయించిన సిఎం
2018 నాటికి రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సర్పంచులు, ప్రజాప్రతినిధుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఓడిఎఫ్ సాధించిన మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలకు చెందిన మునిసిపల్ కమిషనర్లు, మేయర్లు, ఛైర్‌పర్సన్లు, సర్పంచులకు జ్ఞాపికలు, సర్ట్ఫికెట్లు అందజేశారు. అలాగే మల్లిగాడు మరుగుదొడ్డి అనే పుస్తకాన్ని రచించిన రచయితను కూడా సిఎం సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. కాగా తిరుమల పరిశుభ్రతను కాపాడుకోవడంలో కృషి చేస్తున్న టిటిడికి కూడా ఆయన జ్ఞాపికను, ప్రశంసాపత్రాన్ని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు.

చిత్రం... పరిశుభ్రతపై రచించిన పుస్తకాలను ఆవిష్కరిస్తున్న దృశ్యం