ఆంధ్రప్రదేశ్‌

దేశ ద్రోహులకు వత్తాసు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: అత్యున్నతమైన పార్లమెంట్ భవనాన్ని అందులోనున్న పార్లమెంటు సభ్యులతో మట్టుబెట్టే దురుద్దేశంతో 13 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అఫ్జల్‌గురు, ముంబయి పేలుళ్లలో సూత్రధారి యాకూబ్ మీనన్ వంటి వారికి జేజేలు పలుకుతున్న సంఘ విద్రోహులకు సంఘీభావం పలుకటం సిగ్గుచేటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. ఇటువంటి శక్తులు భారత్ మాతాకి జై అని అనకపోయినా దేశ ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు. భారత్‌కీ జై అని, మాతాకి జై అని అనకపోయినా అనబోమని చెప్పే హక్కు ఈ దేశంలో పుట్టి ఏ ఒక్కరికీ లేదన్నారు. తమ దేహంలో తుది రక్తపు బొట్టు ఉన్నంతవరకు ఈ దేశ సార్వభౌమత్వం ఏకత్వమే సమైక్యం కోసం పోరాటం సలుపుతామని చెప్పారు. బిజెపి కృష్ణాజిల్లా, విజయవాడ నగర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నాడిక్కడ జాతీయ సమైక్యతపై జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. సభకు నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు అధ్యక్షత వహించారు. దేశద్రోహులకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలుకుతున్నాయంటూ ఒకప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్ష స్థానంలో ఉండి నేడు ఒకే ఒక స్థానానికి పరిమితమైన కమ్యూనిస్టు పార్టీలు అయోమయస్థితిలో తమ ఉనికి కోసం ఏది మాట్లాడుతున్నా వారి ఇంట్లో వారే వినే స్థితిలో లేరన్నారు. ఈ దేశాన్ని ఐదు దశాబ్దాలు పైగా పాలించి అవకాశం వస్తే మళ్లీ పాలించాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇదేం పోయేకాలమంటూ ఆశ్చర్యపోయారు. గడచిన పదేళ్ల మన్మోహన్‌సింగ్ పాలనలో ఆ పార్టీ నాయకులు ఎవరికి అందినంత వారు దోచుకుతిన్నారని, భూగర్భంలోను, భూమిపైన, ఆకాశం, అంతరిక్షంలోనూ కుంభకోణాలకు పాల్పడబట్టే ఈ దేశ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూడా అర్హత లేకుండా ఆ పార్టీని మట్టుబెట్టారన్నారు. ఈ నేపధ్యంలో ఓ చాయ్‌వాలా నరేంద్రమోదీ ప్రపంచ దేశాలనే ఆకర్షించేలా దేశాన్ని పాలిస్తూ స్వర్ణయుగాన్ని సృష్టించబోతుంటే ఇక భవిష్యత్‌లో తమకు అవకాశం రాదన్న భయంతో మోదీ సర్కార్‌ని అప్రతిష్ట పాలుచేసేందుకు దోశ ద్రోహులతో మమేకమై ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. జాతీయవాదం, భారత్ అనే పదాలు భౌగోళికమైనవి కావని, ఈ దేశంలో నివసించే అన్ని మతాలు, వర్గాలు, ప్రాంతాలవారితో మమేకమై ఉన్నందున భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటున్నామని వివరించారు. అయితే భావ దరిద్రులు తమ తల్లికి కాకుండా ఏ తల్లికి నమస్కారం పెడతారో తెలియటం లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఇందిరాగాంధీ తన రాజ్యాధికారాన్ని పదిలం చేసుకోవడం కోసం కమ్యూనిస్టులతో కుమ్మక్కయి కీలకమైన స్థానాల్లో వామపక్ష భావాలు, విదేశీ శక్తుల ప్రభావం కల్గినవారికి పెద్దపీట వేయడం వల్లే దుష్ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో 740 విశ్వవిద్యాలయాలు ఉంటే కేవలం నాలుగైదు విశ్వవిద్యాలయాల్లోనే ప్రస్తుతం అరాచకాలు తాండవిస్తున్నాయన్నారు. సిపిఐ ఎంఎల్ పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం ఉండటంతో కొత్త పేర్లతో ప్రజల్లోకి వెళ్లి తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. విశ్వవిద్యాలయాలు పవిత్ర దేవాలయాలు అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిందేమిటో ప్రజలు గుర్తెరగాలన్నారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి వంటి సంస్థలే దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయభావం కల్గినవన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ను ఇష్టపడే వారంతా వెళ్లగా మిగిలినవారు ఇక్కడే ఉండి సమాన హక్కులతో దేశాన్ని ప్రేమిస్తున్నారన్నారు. అయితే ఇక్కడ బతుకుతూ పాకిస్తాన్‌కు జై కొట్టేవాడిని ఏమనాలని ప్రశ్నించారు. గడచిన పదేళ్లకాలంలో హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరిలో దళితులు కూడా వున్నారన్నారు. ఏ ఒక్క సందర్భంలో అయినా రాహుల్‌గాంధీ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాడా అని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం వాజ్‌పాయ్ అభివృద్ధి రుచి చూపితే ప్రస్తుతం మోదీ ఏడాది కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలో 4 లక్షల 17వేల మరుగుదొడ్లు నిర్మింపచేసారని చెప్పారు. చిన్నచిన్న పనులు చేసుకునే వారికి సైతం ‘ముద్రణ’ పథకం కింద రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు. నేడు బిజెపి సభ్యత్వం రూ.11 కోట్లకు చేరిందన్నారు. అంతేగాక విదేశాల్లో దిగ్బంధాలకు, ఉరిశిక్షకు గురైనవారిని విడిపించుకువచ్చిన మోదీది జాతీయవాదం కాదా అని ప్రశ్నించారు. సభలో ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు ప్రసంగించారు.

చిత్రం విజయవాడలో శనివారం బిజెపి నిర్వహించిన జాతీయ సమైక్యతా సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు