ఆంధ్రప్రదేశ్‌

ఇక విద్యకు ఆధారే ఆధారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి నుండి విద్యారంగంలో అన్ని అంశాల్లోనూ ఆధార్‌నే ఆధారంగా చేసుకోవాలని రెండు ప్రభుత్వాలూ నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్య ఆధారంగానే ప్రవేశపరీక్ష నిర్వహణ, అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ మంజూరు, అటెండెన్స్ పర్యవేక్షణ కూడా కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల నుండి ఆధార్ సంఖ్యను నమోదుచేస్తున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో అన్ని రకాల స్కాలర్‌షిప్‌ల మంజూరుకు, విద్యావ్యవహారాల్లో ప్రతిభా పాటవాల నమోదుకు, అర్హత సర్ట్ఫికెట్ల జారీలోనూ ఆధార్‌ను ప్రధానంగా వినియోగించనున్నారు. పరీక్షలు ఒకరికి బదులు మరొకరు రాయకుండా అరికట్టడం, రెండు మూడు కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోకుండా నియంత్రించడం, మాస్ కాపీయింగ్, స్కాలర్‌షిప్‌ల కేటాయింపులో అక్రమాలను అరికట్టేందుకు దీనివల్ల సాధ్యమవుతుంది. రానున్న రోజుల్లో ఏ ప్రవేశపరీక్ష రాయాలన్నా ఆధార్ సంఖ్యను తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఆధార్ సంఖ్య లేకుంటే ప్రస్తుతం ఎమ్సెట్ పరీక్ష కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది. టెన్త్ పరీక్షల దరఖాస్తులోనూ ఆధార్ సంఖ్యను నమోదుచేస్తున్నారు. దీనివల్ల విద్యార్థి ఏ చదువుకు వెళ్లినా ఆధార్ సంఖ్య ఆధారంగా ఆయన మొత్తం వివరాలు రానున్న రోజుల్లో మానిటర్ చేసేందుకు వీలుకలుగుతుంది. దీనికి తోడు ఈ ఏడాది అన్ని ప్రవేశపరీక్షల్లో విద్యార్థుల నుండి బయోమెట్రిక్ డాటాను సేకరించారు. ఆ బయోమెట్రిక్ డాటానే అడ్మిషన్ల సమయంలో వెరిఫికేషన్‌కు వినియోగించుకున్నారు. బయోమెట్రిక్ డాటాను, మరో పక్క ఆధార్‌లోని డాటాను సమన్వయం చేయడం ద్వారా నకిలీ విద్యార్థుల గుర్తింపు చాలా తేలిక అవుతుందని, దీనివల్ల విద్యారంగంలో అనైతిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని విద్యాశాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.