ఆంధ్రప్రదేశ్‌

జ్యోతులకు కీలక బాధ్యతలు అధికార పార్టీ హామీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 27: పార్టీలోకి వస్తే కీలక బాధ్యతలను అప్పగిస్తామంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అధికార తెలుగుదేశం పార్టీ నుండి స్పష్టమైన హామీ లభించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష ఉపనేతగా ఉన్న జ్యోతుల నెహ్రూకు తూర్పు గోదావరి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. కాపు సామాజికవర్గానికి చెందిన నెహ్రూ గతంలో జగ్గంపేట ఎమ్మెల్యేగా పనిచేస్తూ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. పిఆర్‌పి తరఫున జగ్గంపేట నుండి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు. తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరి 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసిపి నుండి భూమా నాగిరెడ్డి తెలుగుదేశంలో చేరగానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవికి తన పేరును పరిశీలిస్తారన్న ఆశపడ్డారు. ఆ పదవి దక్కకపోగా అధికార తెలుగుదేశం నుండి ఆహ్వానం అందడంతో వైసిపిని వీడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకప్పుడు నెహ్రూకు మంత్రి పదవి రాకుండా అప్పటి అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇంతవరకు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలను శాసించిన యనమల రాజ్యసభకు నామినేట్ అయ్యి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జిల్లా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే అవకాశం తనకు లభిస్తుందన్న ఆశతో జ్యోతుల ఉన్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందుగానే జ్యోతులకు మంత్రి గిరీ ఇవ్వడం తథ్యమన్న ప్రచారం జరుగుతోంది.

చిత్రం గోకవరంలో పార్టీ నేతలతో మాట్లాడుతున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.