తెలంగాణ

సీతారామ ఎత్తిపోతలపై సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 27: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మించ తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సమగ్ర సర్వేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టేకులపల్లి మండలం రోళ్లపాడుకు గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పథకానికి ఇటీవలే ముఖ్యమంత్రి కెసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర సర్వే బాధ్యతను వ్యాప్‌కాస్ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ ప్రతినిధి బృందం హెలీకాప్టర్‌లో ఆదివారం సాయంత్రం భద్రాచలంలోని జూనియర్ కళాశాల క్రీడామైదానికి చేరుకుంది. నేటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు. సుమారు 467 కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ప్రాజెక్టు పరిధిలో అధునాతమైన కెమెరాలతో దృశ్యాలు చిత్రీకరించి బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి పంపనున్నారు. అక్కడ తుది నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తారు. మే నెలలోనే పనులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి. రూ.7, 926కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీఓ నెం.11ను జారీ చేసిన సంగతి పాఠకులకు విదితమే.