ఆంధ్రప్రదేశ్‌

జలీల్‌ఖాన్ ఇంటిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 27: ఇటీవల వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన విజయవాడ నగర పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై పోలీసులు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య చోటుచేసుకున్న ఈ సంఘటనపై కొంతమంది తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని జలీల్‌ఖాన్ ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆయన ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం జలీల్‌ఖాన్ ఇంటికి వైకాపాకు చెందిన కొంతమంది వ్యక్తులు విప్ జారీ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ వర్గీయులకు వైకాపా వర్గీయులకు మధ్య వివాదం రేకి పరస్పర దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను సంరక్షించారు. ఇది ఇలా ఉండగా ఇరుగు సుబ్రహ్మణ్యం, మరి కొందరు తమ నివాసానికి వచ్చి తనపై దాడి యత్నించారని జలీల్‌ఖాన్ స్వయంగా వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తాము విప్ జారీ చేయటానికే జలీల్‌ఖాన్ నివాసానికి వెళ్లామని ఆయన వర్గీయులే తమపై దాడి చేశారని ఇరుగు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జలీల్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. సంఘటన పూర్వపరాలు పరిశీలించిన పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై వెస్ట్‌జోన్ ఎసిపి గున్నం రామకృష్ణని వివరణ అడుగగా ఇరువర్గాల మధ్య ఘర్షణ రేగిన విషయాన్ని నిర్ధారిస్తూ ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని తెలిపారు.

రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్ట్‌పై ఎసిబి దాడులు
రేణిగుంట, మార్చి 27: ఆర్టీవో చెక్‌పోస్టుపై ఎసిబి శనివారం అర్థరాత్రి దాడులు చేపట్టగా ఇద్దరు ప్రైవేటు ఏజెంట్లు పరారైన సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది. ఆర్టీవో చెక్‌పోస్టులో ప్రైవేటు ఏజెంట్లు, హోంగార్డుల ద్వారా అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ లారీ యజమానులు, డ్రైవర్లు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఎసిబి శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు చెక్‌పోస్టులో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అక్కడ నుంచి ఇద్దరు ప్రైవేటు ఏజెంట్లు పరారవ్వగా దాడుల్లో లెక్కకు మించి 5,800 రూపాయలను సీజ్ చేశారు. విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎంవిఐలు హేమకుమార్, జయశ్రీ, హోంగార్డు నరేంద్రపై ఎసిబి కేసులు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తోంది. ఇదిలావుండగా గత కొంతకాలంగా రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టుపై అక్రమ వసూళ్లు వీడియో పుటేజ్ సోషల్ మీడియా, వాట్సప్స్‌లలో భారీఎత్తున హల్‌చల్ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వీడియో పుటేజ్‌ల ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ చేపట్టిన కొద్దిరోజులకే ఆర్టీవో చెక్‌పోస్టుపై ఎసిబి దాడులు జరగడం విశేషం.