ఆంధ్రప్రదేశ్‌

భూసార పరీక్షలపై లఘుచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 27: దేశంలో భూసార పరీక్షలకు సంబంధించి ఎంపిక చేసిన ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డుకు విశాఖ జిల్లా రెండో స్థానం దక్కించుకున్న విషయం విదితమే. గుజరాత్‌లోని నర్మదా జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా, మన రాష్ట్రంలోని విశాఖపట్నం రెండో స్థానం దక్కించుకుంది. దీంతో ఢిల్లీ బృందం గత రెండు రోజులుగా విశాఖలో లఘుచిత్రం రూపొందించింది. జిల్లాలోని అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రంలోను, కుశలవాడ, అరకు ప్రాంతాల్లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. మట్టి నమూనా సేకరణ, భూసార పరీక్షలు, భూసారంపై రైతుల్లో అవగాహన తదితర అంశాలపై సన్నివేశాలను చిత్రీకరించారు. తొమ్మిది మంది సభ్యులు గల బృందానికి అమితా ఆత్రేయ సారధ్యం వహించారు. ఈ చిత్రానికి ఫొటోగ్రాఫర్‌గా గురువిందర్‌సింగ్, కోఆర్డినేటర్‌గా నిపుణ్ వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఈ అవార్డుకు తొలుత దేశంలో 20 జిల్లాలను ఎంపిక చేసి వడపోశారు. అందులో ఐదు జిల్లాలు ఎంపికయ్యాయి. వాటిలో మన రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు స్థానం సంపాదించాయి. అయితే ఆయా జిల్లాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన బృందం క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపిన తరువాత చివరకు రెండు జిల్లాలను ఎంపిక చేశారు.