ఆంధ్రప్రదేశ్‌

కాలుష్యం ఉండదు నాదీ గ్యారంటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: ‘నాపై ప్రేమాభిమానాలు చూపి, నన్ను ఆదరించిన పశ్చిమ గోదావరి జిల్లాకు అన్యాయం జరగనిస్తానా... గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్కువల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు..నాదీ గ్యారం టీ’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించేందుకు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన ఆయన విలేఖర్ల సమావేశంలో ఇటీవలికాలంలో వివాదాస్పదంగా మారిన ఆక్వా ఫుడ్ పార్కు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెగా ఫుడ్ పార్కు వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వరి, కొబ్బరి, పామాయిల్, చెరకు వంటి ప్రధాన పంటలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రధానమైన ఆక్వా కల్చర్‌కు అంతర్జాతీయంగా అంత్యంత గుర్తింపు లభించిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రానికే ఆక్వా హబ్‌గా మారనుందన్నారు. ఇక్కడ నుంచి రూ.10 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను వియత్నాం తరలించి, అక్కడ ప్రాసెస్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా ఎగుమతి చేస్తున్నారన్నారు. అదే ప్రాసెసింగ్ యూనిట్ మనమే ఇక్కడ పెట్టుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పార్కు ద్వారా ఏటా రూ.12 వేల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం వుందన్నారు. ఈ పార్కు వల్ల ఎటువంటి కాలుష్యం వుండదని, ప్రాసెస్ చేసేటపుడు విడుదలయ్యే వ్యర్ధ జలాలను ట్రీట్‌మెంట్ అనంతరం పైపులైన్ ద్వారా నేరుగా సముద్రంలోకి విడిచిపెడతారని చెప్పారు.