ఆంధ్రప్రదేశ్‌

కార్మిక చట్టాల ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 27: చిన్న తరహా పరిశ్రమల్లో కార్మిక చట్టాల ఆవశ్యకతపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవరాయ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమల్లో కార్మికుల కనీస సంఖ్యను 40కు కుదించడంతో పాటు ఆయా కంపెనీల్లో 14 రకాలైన కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం కార్మిక వర్గాన్ని అణగదొక్కే ప్రక్రియని ఆరోపించారు. కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 90 శాతం చట్టాలను తొలగించే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు.
ఇపిఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను అంశంపై వ్యతిరేకత రాగా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న దేశ రాజధానిలో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.