ఆంధ్రప్రదేశ్‌

వైకాపాకు చీలిక ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 27: రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాలో చీలిక తీసుకువచ్చేందుకు పావులు శరవేగంగా కదులుతున్నాయి. ఆ పార్టీ నుంచి 23 మందికి పైగా ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తయ్యాయని టిడిపి నేతల ద్వారా తెలుస్తోంది. వారెవరన్నది ఇప్పుడే చెప్పలేమని త్వరలో పార్టీలో చేరే సమయంలో బహిరంగమవుతుందని పేర్కొంటున్నారు. శాసనసభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ఈ నెల 29, 30వ తేదీల్లో చర్చ చేపట్టనుంది. ఆ చర్చలో ఖచ్చితంగా పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టే ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని వైకాపా ఇప్పటికే విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిరోజుల క్రితం పార్టీ మారిన వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, మణిగాంధీ ఏం చేస్తారని చర్చ సాగుతున్న సమయంలో మరోమారు టిడిపి వైకాపా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతోందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పిఎసి చైర్మన్ పదవి కట్టబెట్టడంపై వైకాపాలోని కొందరు ఎమ్మెల్యేలు కినుక వహించి పార్టీకి దూరం కావడానికి సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని అవకాశంగా మలుచుకుని గతంలో పార్టీ మారేందుకు వెనుకాడిన ఎమ్మెల్యేలతో మరోమారు చర్చించి చీలికకు రంగం సిద్ధం చేశారని టిడిపి వర్గాలు వెల్లడిస్తున్నాయి. దశల వారీగా వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పార్టీకి దూరం చేసి సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించడానికి వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైకాపా నుంచి 10 మంది వరకూ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని వైకాపా ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.