ఆంధ్రప్రదేశ్‌

అమరావతి డిజైన్ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితం కావాల్సివున్న సచివాలయం, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్, ఇతర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన వివిధ దేశ, విదేశీ కంపెనీలు రూపొందించిన డిజైన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన జపాన్‌కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్ పట్ల అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిజైన్ ఖరారులో విమర్శలు తలెత్తకుండా ఉండేందుకై ప్రభుత్వం ఎంతో వ్యూహంగా తాను ఖరారు చేసిన జపాన్ కంపెనీ డిజైన్‌తో పాటు ఆఖరి క్షణం వరకు పోటీలో నిలిచిన బ్రిటన్‌కు చెందిన రోజర్స్ స్టైక్ హార్బర్ అండ్ పార్టనర్స్ (్భరత్‌కు చెందిన వాస్తుశిల్ప కన్సల్టెంట్) డిజైన్లతో కల్సి ఈ మూడు డిజైన్లను సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా స్థానిక ఓ స్టార్ హోటల్‌లో ప్రదర్శనగా వుంచారు. నగరవాసులు ముఖ్యంగా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీటిని క్షుణ్ణంగా పరిశీలించారు. జ్యూరీ ఎంపిక చేసిన జపాన్ కంపెనీ డిజైన్‌లోని నిర్మాణాల పట్ల దాదాపు అందరూ సంతృప్తి వ్యక్తం చేసారు. అయితే ఇతర రెండు డిజైన్లలోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందంటూ పలువురు అనేకానేక సూచనలు, సలహాలందించారు. అతి తక్కువ మంది ఖరారైన డిజైన్ నుంచి కొన్ని మార్పులు, సూచనలు చేసారు. అమరావతి ప్రభుత్వ భవనాల నిర్మాణాల నమూనాల్లో హైకోర్టు నమూనా చాలా బాగుందంటూ పలువురు పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రదర్శనలో ఉంచబడిన మూడు డిజైన్లు కూడా పరస్పరం పోటీపడే విధంగా ఉన్నాయంటున్నారు. ప్రధానంగా ఎంపికైన జపాన్ డిజైన్‌లో గ్రీన్ కానె్సప్ట్ బాగుందంటున్నారు. ఆయా భవనాల మధ్య వచ్చేలా ప్రతిపాదించిన వాటర్ బాడీస్ తదితరాలు పర్యావరణ హితంగా వుండనున్నాయి. ఈ విధమైన ప్రాధాన్యత, ఇతర డిజైన్లలో కన్పించలేదు. ఇదిలా ఉంటే వాస్తుశిల్పి కన్సల్టెంట్స్ డిజైన్‌లో హైకోర్టు నిర్మాణం కోసం చూపిన స్థలం, ఆకృతి చాలా బాగుందంటున్నారు. ఎంపికైన డిజైన్‌లో విహంగ వీక్షణం ద్వారా చూసేవారికి మొత్తం ప్రభుత్వ భవనాలు ముఖ్యంగా చట్టసభలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ విషయంలో ఆర్కిటెక్టులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా చట్టసభలకు హాజరయ్యే మంత్రులు అతి తక్కువ దూరం ప్రయాణంతోనే తమ తమ కార్యాలయాలకు చేరుకునేలా ప్లాన్‌లో చూపారు. ఇక వాస్తుశిల్పి కన్సల్టెంట్స్ తన డిజైన్‌లో చట్టసభల చుట్టూ నిరంతరం నీరు ప్రవహించేలా ఆర్కిటెక్టులు ప్రత్యేకంగా నమూనా సిద్ధం చేసారు. బ్రిటన్ కంపెనీ డిజైన్‌లో చట్టసభలను కృష్ణమ్మ ఒడ్డున, ఇతర భవనాలను ఆరుబయట విశాలమైన స్థలంలో వుండేలా చూసారు.
జపాన్ డిజైన్‌లో హైకోర్టు భవనాలకు సంబంధించి నలుదిశలా గ్రీనరీతో అలంకరిస్తూ ఆ పక్కనే నడకదారులను ప్రతిపాదించి ఆ కింద వాటర్ బాడీస్ నిర్మాణంతో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చూసారు. ప్రదానంగా రాత్రివేళలో కూడా నగర అందాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా నిర్మాణ నమూనాలున్నాయి. రివర్ ఫ్రంట్ సిటీగా పేర్కొన్న అమరావతిలో పగటివేళ ప్రజ్వరిల్లేలా ఉండే ఐకానిక్ భవనాలు రాత్రివేళ కూడా అదే రీతిలో కాంతులు విరజిమ్మేలా మూడు డిజైన్లు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రపంచ స్థాయి నిర్మాణ శైలికి అద్దం పడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను, విజన్‌ను ప్రతిబింబించేలా జపాన్ డిజైన్ ఉందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.

చిత్రం అమరావతి డిజైన్‌ను తిలకిస్తున్న ప్రజలు