ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ వినియోగంలో పొదుపు మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: విద్యుత్ వినియోగంలో పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. ఎల్‌ఇడి బల్బులను వినియోగించి విద్యుత్ వినియోగంలో పెద్ద ఎత్తున పొదుపు చేసి విజయం సాధించి జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించడంతో ఏపి ప్రభుత్వం త్వరలో మరికొన్ని విద్యుత్ పొదుపు చర్యలకు తెరతీయబోతోంది. రానున్న రోజుల్లో గృహోపకరణాలైన సీలింగ్ ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు తదితర పరికరాలకు ఎల్‌ఇడి టెక్నాలజీని విస్తరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఒక సమావేశం సందర్భంగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఆజయ్ జైన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు విద్యుత్ పొదుపు చర్యలను ఎంత ఎక్కువ చేస్తే ఆ స్థాయిలో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందో దిశా నిర్దేశం చేయడంతో ఆ ప్రకారం అధికార యంత్రాంగం ముందుకెళ్తోంది. కాగా, రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సీలింగ్ ఫ్యాన్ల విధానాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని అజయ్ జైన్ తెలిపారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో విజయవాడలో అంతర్జాతీయ ఇంధన సామర్థ్య, సంరక్షణ విధానాలపై సదస్సు జరగనున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబును అజయ్ జైన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియేన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ సౌరభ్ కుమార్ కలిశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ చేపట్టిన ఇంధన పొదుపు సంరక్షణ విధానాలపై సమీక్షించినట్లు రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సిఇఒ ఎ చంద్రశేఖరరెడ్డి ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో 2017 నాటికి విద్యుత్ వినియోగంలో కొత్త ఒరవడిని సృష్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. కాగా, రానున్న రోజుల్లో వ్యవసాయ పంపుసెట్లను దశలవారీగా మార్చివేసి వాటి స్థానంలో కొత్తగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న మోటార్లను కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఈ మేరకు ప్రయోగత్మకంగా పైలెట్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే.