తెలంగాణ

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, అక్టోబర్ 19: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. దీనిపై న్యాయ వ్యవస్థ కూడా స్పందించడం లేదని అన్నారు. బుధవారం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ అధ్యక్షుడు జి. నిరంజన్ అధ్యక్షతన ఏర్పాటైన సభకు దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ సంరక్షకునిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీలో చేరే వారంతా వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్టుల కోసమే చేరుతున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ పార్టీలో చేర్చుకోమని ఆయన చెప్పారు.
ఉమ్మడి స్మృతికి వ్యతిరేకం..
ఎవరి సంస్కృతి, సంప్రదాయం వారికి ఉంటుందని, అయినా ఉమ్మడి స్మృతి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. దీనిని తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మన సైనికులను ఇజ్రాయిల్ సైనికులతో పోల్చడం సరైంది కాదని, ఇది ఒక రకంగా వారిని అవమానించడమే అవుతుందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారని, నిజానికి లోగడ ఇటువంటివి ఎన్నో జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాది సద్భావన పురస్కారాన్ని హిమాచల్‌ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ ఎంఎస్ రావుకు ప్రదానం చేసి అభినందించారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ,ప్రస్తుతం మన దేశంలోనే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారని, ఇది కేవలం రాజీవ్‌గాంధీ విజన్ 2020 వల్లే సాధ్యమైందన్నారు.
బుధవారం హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎఐసిసి నేత
దిగ్విజయ్ సింగ్. టి.కాంగ్రెస్ నేతలు