ఆంధ్రప్రదేశ్‌

ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు వస్తున్నందున తప్పకుండా హాజరవ్వాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా విప్ జారీ చేసింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొని ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా విప్ జారీ చేసినట్లు విప్ అమరనాథ్ రెడ్డి ప్రకటించారు. వైకాపా గుర్తుపై గెలిచిన శాసనసభ్యులందరికీ ఈ నెల 21వ తేదీన విప్ జారీ చేసినట్లు చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన వెంటనే డివిజన్ (శాసనసభ్యుల లెక్కింపు) ద్వారా లెక్కింపు నిర్వహించాలని స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయానికి ఎవరు వ్యతిరేకంగా ఓటు వేసినా, సమావేశానికి హాజరుకాకపోయినా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుందని ఆయన చెప్పారు.