రాష్ట్రీయం

చరిత్ర పుటల్లో అమరావతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 21: అదో అరుదైన సన్నివేశం.. రాజధానిలేని అవశేష ఆంధ్రప్రదేశ్‌కు దిక్సూచిగా నిలిచిన ప్రపంచ నగరం అమరావతికి అంకురార్పణ జరిగిన మధుర ఘట్టాలు.. దేశ ప్రధాని.. కేంద్రమంత్రులు.. ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు.. ఒకరేంటి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన వేళ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిన అద్భుత ఘడియలు.. నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తయింది.. ఎన్నో బాలారిష్టాలను అధిగమించి ప్రపంచంలోని పంచ నగరాల సరసన నిలపాలనే ప్రయత్నాలకు గత ఏడాది అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన జరిగింది. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల 500 ఎకరాలు అందజేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ప్రధానమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కెసిఆర్‌లతో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, విదేశీ ప్రతినిధులు ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలికారు. సకల సముద్ర, నదీ జలాలతో పాటు పవిత్ర మట్టితో కలశాలను రాజధానికి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ సైతం గంగ, యమున నదీజలాలను తీసుకువచ్చి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకపూజలు నిర్వహించి ఉద్ధండరాయనిపాలెం వద్ద ప్రత్యేకపూజలతో శంకుస్థాపన చేశారు.
ఏడాది కాలంలో తాత్కాలిక రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసుకుని పాలనా వ్యవస్థను కేంద్రీకృతం చేయటం ప్రభుత్వం వేసిన ఓ ముందడుగుగా చెప్పక తప్పదు. రాజధానిలో పెట్టుబడులకు సింగపూర్, జపాన్, చైనా, రష్యా, అమెరికా వంటి అగ్రదేశాలు ముందుకొచ్చాయి. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ దశలలో రాజధానిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంతర్జాతీయ నగరంగా గుర్తింపు తీసుకువచ్చే క్రమంలో 9 కానె్సప్ట్ సిటీలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 28న ఆర్థిక, పరిపాలన నగరాలకు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే రాజధాని అభివృద్ధికి స్విస్‌చాలెంజి విధానంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విస్తీర్ణంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధికి రాజధాని ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఏ) సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ విద్యా సంస్థల ప్రతినిధులు ఇప్పటికే ముందుకొచ్చారు. ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. రాజధాని ప్రాంతంలోనే హెల్త్‌సిటీలో ఎయిమ్స్ రూపుదిద్దుకుంటోంది. గతంలో విభజన జరిగిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఓ మైలురాయి కానుంది.
chitram...
గత ఏడాది అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన దృశ్యం (ఫైల్‌ఫొటో)