కడప

రామయ్య మాడ వీధుల ఏర్పాటుకు పురావస్తు శాఖ ఆమోదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 27:ఆంధ్ర భద్రాది ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయానికి చెందిన మాడ వీధుల ఏర్పాటుకు దాదాపుగా కేంద్ర పురావస్తు శాఖ లైన్ క్లియర్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సిమెంట్ రోడ్ పనులు అర్ధాంతరంగా నిలిచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయానికి మాడ వీధులు ఏర్పాటు చేయాలన్నది టిటిడి సంకల్పం. తిరుమల తరహలోనే రామయ్యకు నాలుగు వైపుల మాడ వీధులు ఏర్పాటు చేసేందుకు టిటిడి సమాయత్తం అవుతుంది. ప్రస్తుతం ఆలయం ఉత్తర భాగంలో ఉన్న గృహాలను తొలగించకుండా ఆలయం లోపల ఉన్న గార్డన్ తొలగించి మాడ వీధులు ఏర్పాటు చేయాలని టిటిడి భావిస్తుంది. అధికారికంగా కేంద్ర పురావస్తు శాఖ పూర్తిస్థాయిలో అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ పనుల పరిశీలనకు బెంగుళూరుకు చెందిన రీజనల్ డైరెక్టర్ సత్యభామ బద్రీనాధ్ ఆదివారం ఉదయం ఆ శాఖ అధికారులు, టిటిడి అధికారులతో కలసి ఆలయానికి 3 మీటర్లు విడచి మాడ వీధులను ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిస్థాయి అనుమతి కోసం ఢిల్లీకి నివేదించి మరో రెండు రోజులలో అనుమతి మంజూరుకు కృషి చేస్తామని ఆర్డీ తెలిపినట్లు టిటిడి జెఇఓ పోలా భాస్కర్ తెలిపారు. ఆలయం చుట్టూ 3 మీటర్లు వదలి మాడ వీధుల ఏర్పాటుకు అనుమతి రెండు రోజులలో వస్తుందని, ఆ వెంటనే పనులు చేపడతామన్నారు. ఆర్డీ ఆలయ ప్రాంగణమంతా పరిశీలించి, మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా పురావస్తు శాఖ అధికారులు, టిటిడి ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా రాజకీయంలో గందరగోళం..!

ఆంధ్రభూమిబ్యూరో
కడప, మార్చి 27:జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలలో రోజుకో మలుపు తిరుగుతూ జిల్లా పరిస్థితి గందరగోళంగా మారింది. కులాల, మతాల మధ్య రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అయితే జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. జిల్లాలో రాజకీయాలను శాసించే రెడ్డి సామాజిక వర్గం 2019 ఎన్నికల నాటికి వైకాపా వెంటే వస్తుందని ఆ పార్టీ హై కమాండ్ ధీమా వ్యక్తం చేస్తుంది. దీనికి తోడు మైనార్టీ, క్రైస్తవ మైనార్టీ మా వైపే ఉన్నారని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా రెడ్ల సామాజిక వర్గమంతా టిడిపి వైపై ఉందని, ఎన్నికల నాటికే ఆ వర్గమంతా మా వైపే వస్తుందని వైకాపా హై కమాండ్ ధీమాలో ఉంది. రెడ్ల సామాజిక వర్గం, మైనార్టీ, కైస్తవ్ర సామాజిక వర్గం ఎన్నికల నాటికి తమ వైపుకే మళ్లుతుందంటున్నారు. రాష్టమ్రంతా రాజకీయ సామాజిక వర్గం ఎలా ఉన్నా, వైఎస్ జగన్మోహనరెడ్డి స్వంత జిల్లాయైన కడపజిల్లాలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు. అయితే వైకాపాలో నేతలు చేరడంతో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న ప్రాంతాలలో వారు సైతం తటాపటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పులివెందుల మినహా మిగిలిన నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతలు అధిపత్య పోరుతో పార్టీ కార్యకర్తలలోని నిరుత్సాహాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీ నేతలంతా ఏకమై తెలుగుదేశం పార్టీని ఢీ కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అంతే కాకుండా జిల్లాలో వైకాపా నేతలే అధిపత్యం ఉన్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఒక అడుగు వైకాపా వైపే వెనక్కు అడుగేసి నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తలు అధికంగా ఉన్న విషయం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి జగమెరిగిన సత్యం. అధికార దాహం కోసం వచ్చే నేతలు తప్ప మిగితా అంతా వైకాపా వెంటే ఉన్నట్లు తెలుస్తుంది. ఏదీ ఏమైనప్పటికీ జిల్లాలో రాజకీయాలు గందరగోళంగా నెలకున్నాయి.