ఆంధ్రప్రదేశ్‌

రూ.3600 కోట్ల ఆర్టీసీ నష్టాలను భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఆంధ్ర ఆర్టీసి రూ. 3600 కోట్ల నష్టాలతో ఉందని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు, సీనియర్ నేత కె పద్మాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్ 13న ఆంధ్రాలోని అన్ని ఆర్టీసి డిపోల వద్ద సామూహిక దీక్షలను చేపట్టనున్నట్లు చెప్పారు. నష్టాలపేరుతో బస్సులను తగ్గించి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే విధానాలు, సిబ్బందిని కుదిస్తున్న విధానాలు మానుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరువందల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. 60 రోజులు సమైక్యాంధ్ర సమ్మెకాలాన్ని ఎన్‌జీవోల మాదిరిగా ఆర్టీసి కార్మికులకు స్పెషల్ క్యాజువల్ లీవుగా పరిగణించాలన్నారు. అక్రమరవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల్లో ఇంకా మిగిలి ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్స్‌తో పాటు సెప్టెంబర్ 14న యాజమాన్యంకు ఇచ్చిన 41 డిమాండ్స్‌ను పరిష్కరించాలన్నారు.