ఆంధ్రప్రదేశ్‌

‘దేశం’ పిలిచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: పదవులకు ఆశపడి తాను వైకాపాను వీడడం లేదని, ఆ పార్టీ విధానాలపై తనకు అసంతృప్తిగా ఉందని, నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడి వారి ఆకాంక్ష మేరకు తాను పార్టీ మారనున్నట్లు వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ తన ఇంట్లో విలేఖర్లతో ముచ్చటిస్తూ పిఏసి చైర్మన్ పదవి రాలేదనే అసంతృప్తితో తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన సమాచారంలో నిజంలేదన్నారు. తాను అనేక పార్టీలు మారానని, తాను ప్రస్తుత రాజకీయాలకు తగనేమోననిపిస్తుందన్నారు. వైకాపాలో నెలకొన్న వాతావరణంలో తాను ఇమడలేనన్నారు. తనకు ఆర్ధిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడితో ఎటువంటి అభిప్రాయబేధాలులేవని, గతంలో పార్టీలో కలిసి పనిచేశామన్నారు. తాను త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లో నిక్కచ్చిగా ఉంటానని, తనకు మొదటి నుంచి పదవులపై ఎటువంటి ఆశలు లేవన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు కూడా పార్టీ మారడమే మంచిదని అభిప్రాయం తెలియచేశారన్నారు. టిడిపి పార్టీ తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించిందని ఆయన చెప్పారు. వైకాపా నుంచి ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారనే విషయం తనకు తెలియదన్నారు.