ఆంధ్రప్రదేశ్‌

చిన్న ఆలయాలను అర్చకులకు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 27: గ్రామీణ ప్రాంతాల్లో సనాతన ధర్మాన్ని రక్షించాలంటే చిన్న దేవాలయాలను ఆయా అర్చకులకు అప్పగించాలని హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సిఎస్ రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్ర పాంచరాత్ర అర్చక సమాఖ్య ద్వితీయ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగరాజన్ మాట్లాడుతూ చిన్న దేవాలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వాటికి ధర్మకర్తల మండళ్లు ఏర్పాటుచేయడంతో అవి ఉనికిని కోల్పోయాయన్నారు. ఇప్పటికైనా చిన్న ఆలయాల బాధ్యతలు ఆయా అర్చకులకు అప్పగిస్తే పరిస్థితి చక్కబడుతుందన్నారు. సమావేశంలో టిటిడి విశ్రాంత పాంచరాత్ర ఆగమ సలహాదారులు చామర్తి జగ్గప్పలాచార్యులు మాట్లాడుతూ ఆంధ్ర పంచరాత్ర సమాఖ్య కార్యకలాపాలను పునరుద్ధరించడానికి రాష్టవ్య్రాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాంచరాత్ర సమాఖ్య కన్వీనర్ గొడవర్తి శ్రీనివాసాచార్యులు, రాష్ట్రంలోని దేవాలయాల నుండి వచ్చిన అర్చకులు పాల్గొన్నారు.

చిత్రం.. ఆంధ్ర పాంచరాత్ర అర్చక సమాఖ్య ద్వితీయ వార్షికోత్సవ
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న కాండూరి శ్రీనివాసాచార్యులు