ఆంధ్రప్రదేశ్‌

నేత్రపర్వం.. ఖాద్రీశుని బ్రహ్మరథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మార్చి 29 : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం (తేరు) సోమవారం భక్తుల గోవిందనామస్మరణ మధ్య తిరువీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మరథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తరలివచ్చారు.
ఖాద్రీ నరసింహస్వామి బ్రహ్మరథం ఆసియా ఖండంలోనే రెండవదిగా పేరుగాంచింది. ఈ నెల 17వ తేదీ అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు కన్నుల పండువగా జరిగాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రథం ముందు కలశపూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి బూడిద గుమ్మడికాయలు, దవనం, మిరియాలు, పూలు పండ్లు, సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవిందనామస్మరణతో పట్టణంలోని తిరువీధులు మార్మోగాయి.
బ్రహ్మరథం చక్రాల కింద బూడిద గుమ్మడికాయలు సమర్పించి మొక్కు తీర్చుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతేకాకుండా రథం ముందుకు కదిలిన తర్వాత రథం నుంచి నేలమీదకు పడిన మిరియాలు, దవనం కోసం భక్తులు ఎగబడ్డారు. రథోత్సవంలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఆర్డీఓ రాజశేఖర్, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.