ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి మరో 4 మెగా ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు తరలివస్తున్నాయి. 53,100 మందికి ఉపాధి కల్పించే నాలుగు మెగా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ప్రఖ్యాతిగాంచిన డిక్సాన్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్, రిలయన్స్ ఢిఫెన్సు ఇంజనీరింగ్ లిమిటెడ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్, ఎస్సెల్ జిసిఎల్ కన్సార్టియం సంస్థలు రాష్ట్రంలో 26,630 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో 39,900 మందికి ప్రత్యక్షంగా, 13200 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం స్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపిబి) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉండి, రాష్ట్రంలో కొత్తగా తమ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు సిఎం అంగీకరించారు. ఈ తరహాలో 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన యునైటెడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్ సంస్థ, కామినేని పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ సంస్థల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. 295 కోట్ల రూపాయలతో 6700 మందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండున్నర ఏళ్లలో 3.31 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 375 పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 253 పరిశ్రమల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, మరో 55 పరిశ్రమలకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. రియల్ టైమ్‌లో రాయితీలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని సిఎం తెలిపారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎస్‌ఐపిబి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సిఎం