ఆంధ్రప్రదేశ్‌

‘పట్టిసం’పై జ్యోతుల యు టర్న్ తీసుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 28: ఇంతవరకు పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేడు అదే పథకానికి జైకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా రాజకీయ మహిమగా గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు చెప్పుకుంటున్నారు. పట్టిసం నిర్మాణం వలన గోదావరి జిల్లాల రైతులు, ప్రజలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని జ్యోతుల నెహ్రూ గతేడాది ఉద్యమాన్ని ప్రారంభించారు. పట్టిసం పథకానికి వ్యతిరేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు చేపట్టి, ధర్నాలు నిర్వహించిన జ్యోతుల ఈ సమస్యపై ప్రతిపక్ష నేత జగన్‌కు సైతం అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఒక దశలో పట్టిసం నిర్మిస్తే శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని హెచ్చరించిన జ్యోతుల అనేక సందర్భాలలో ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల నోట్లో మట్టికొట్టి, గోదావరి జలాలను కృష్ణా మీదుగా రాయలసీమకు పంపడం అసాధ్యమని జగన్‌చేతే అసెంబ్లీలో ప్రకటనలు చేయించారు. కేవలం అధికార పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని ఆదరాబాదరాగా చేపట్టారంటూ ధ్వజమెత్తారు. పట్టిసం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. వాస్తవానికి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఇంతవరకు వైసిపిలో తగిన అవగాహన ఉన్న నాయకుడిగా జ్యోతులకు గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జ్యోతుల వ్యతిరేకిస్తూ వచ్చారు. పైగా సాగునీటి ప్రాజెక్టులపై శాసన సభ సమావేశాలు, బహిరంగ సభలు, మీడియా సమావేశాలలో మాట్లాడాల్సి వచ్చినపుడు వైసిపి తరఫున జ్యోతుల నెహ్రూ మాత్రమే కీలక భూమిక పోషించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారడానికి సిద్ధమైన జ్యోతుల ఇక పట్టిసీం వ్యవహారంపై యు టర్న్ తీసుకున్నట్టేనని గోదావరి జిల్లాలకు చెందిన రైతులు చర్చించుకుంటున్నారు.