ఆంధ్రప్రదేశ్‌

పనిచేయకుంటే బ్లాక్‌లిస్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏరకమైన అలసత్వాన్ని ప్రదర్శించినా బాధ్యులైన కాంట్రాక్టు సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అనుకున్న సమయానికి, అనుకున్న దానికంటే మెరుగ్గా, అంతర్జాతీయ ప్రమాణాలతో నవ్యాంధ్ర రాజధానిని నిర్మించే విషయంలో ఏ విధంగానూ రాజీపడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసే రోడ్ నెట్‌వర్క్ పనులు మందకొడిగా సాగడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. రహదారితో పాటు ఇతర నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయకుంటే కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా రూ.3,600 కోట్లతో 270కిమీల ప్రధాన రహదారిని, దానికి అనుబంధంగా 130కి.మీల రహదారులను ఎట్టి పరిస్థితిలోనూ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో అమరావతి నిర్మాణ పనులపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అవసరం వున్నచోటే వౌలిక వసతులు కల్పిస్తే నిధులు సద్వినియోగవౌతాయని, ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు దోహదపడతాయని చంద్రబాబు అన్నారు. అమరావతి నగరమంతా వంటగ్యాస్, మంచినీరు, టెలిఫోన్, విద్యుత్ లైన్లు, డ్రైనేజీ వంటివన్నీ ఒకేమార్గంలో పైపుల ద్వారా ఏర్పాటుకు సింగపూర్ మోడల్‌ని అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
అమరావతిలో విద్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు ఒకే ప్రాంతంలో కాకుండా నగరం నలుమూలలా ఉండేలా చూడాలన్నారు. విజయవాడతో పాటు అటు గుంటూరు నగరాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. 2018నాటికి జాతీయక్రీడలు నిర్వహించగలిగేలా అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు నిర్మించాల్సి ఉందని, ఇందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా చెప్పారు. రాజధాని గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 10 గ్రామాల్లో రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తిచేసినట్లు తెలిపారు. వచ్చే నెల 15కల్లా అన్ని గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు పూర్తిచేస్తామని తెలిపారు. అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి నోవాటెల్, ఐటిసి, తాజ్ వంటి ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయని, అలాగే ఆసుపత్రులు నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్న కార్పొరేట్ సంస్థలతో ఈ నెల 11న సమావేశం నిర్వహిస్తున్నట్టు వివరించారు. సమావేశంలో మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, సిఆర్‌డిఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్, రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ సంస్థ చైర్మన్ లక్ష్మీపార్థసారథి పాల్గొన్నారు.

చిత్రం... అమరావతి నిర్మాణ పనులపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు