ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛ్భారత్‌లో తిరుపతికి 38వ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 28: స్వచ్ఛరైల్ - స్వచ్ఛ్భారత్‌లో రాష్ట్రంలోని మూడు రైల్వేస్టేషన్లలో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. భారతీయ రైల్వేశాఖ ప్రకటించిన స్వచ్ఛ్భారత్ రైల్వేస్టేషన్లలో తిరుపతి రైల్వేస్టేషన్‌కు 38వ ర్యాంక్ వచ్చింది. వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు 42వ ర్యాంకు లభించగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని విజయవాడ రైల్వేస్టేషన్ 45వ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి పటిష్టవంతంగా అమలు చేస్తోన్న స్వచ్ఛరైల్ - స్వచ్ఛ్భారత్‌లో భారతీయ రైల్వేపరిధిలో ఎ కేటగిరి కింద 332 రైల్వేస్టేషన్లు ఉండగా మరో 75 రైల్వేస్టేషన్లు ఎ-1 కేటగిరి కిందకు వచ్చాయి. వౌలిక వసతులు, పరిశుభ్రతలో భారతీయ రైల్వేపరిధిలో ఏఏ రైల్వేస్టేషన్లు ఉన్నాయనే అంశంపై ప్రయాణికులు, రైల్వే అధికారులు, వివిధ వర్గాల నుంచి వేర్వేరుగా సేకరించిన అభిప్రాయాలు, సర్వే ఆధారంగా ఎ, ఎ-1 కేటగిరిల కింద రైల్వేబోర్డు విభజించింది. రెండు కేటగిరిల్లో 407 రైల్వేస్టేషన్లు నిలువగా ఇందులో ఎ కేటగిరిలో 332 రైల్వేస్టేషన్లు, ఎ-1 కిందకు మరో 75 రైల్వేస్టేషన్లు వచ్చాయి. ఈ స్టేషన్లలో 24 గంటలు పరిశుభ్రత నిర్వహణ, ప్రయాణికులకు అవసరమైన వౌలిక వసతులు కల్పించడం వంటి 40 అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు. అయితే భారతీయరైల్వే ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ వాల్తేరు డివిజన్‌లోకి వచ్చే విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి పరిశుభ్రత, వౌలిక వసతులు కల్పించడంలో ముందంజలో ఉండాలనే తపనతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా డివిజనల్ రైల్వేమేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ ఆధ్వర్యంలో అనేకసార్లు స్వచ్ఛ్భారత్, స్వచ్ఛరైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.