ఆంధ్రప్రదేశ్‌

బిజెపి-టిడిపి విడిపోతే రాష్ట్రానికే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 4: తెలుగుదేశం-బిజెపితో కలసివుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఒకవేళ విడిపోతే రాష్ట్రానికే నష్టమని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు బిజెపి నుండి విడిపోతే మంచిదంటున్నారని, అలా జరిగితే రాష్ట్ర ప్రజలు నష్టపోతారన్నారు. ‘రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి-ప్రత్యేక శ్రద్ధ-ప్రత్యేక సహాయం’ అంశంపై తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియుకె వద్ద శుక్రవారం సాయంత్రం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించారు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో తెలుగుదేశానికి సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు విడిపోయినా తుదకు రాష్ట్రానికే మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం సుమారు గంట పాటు రాజ్యసభలో తాను మాట్లాడిన మాట వాస్తవమేని, ఎపి నుండి తాను రాజ్యసభకు ఎంపిక కాకపోయినా, మన రాష్ట్రానికి మేలుచేయాలని భావించానన్నారు. 14వ ఆర్థిక సంఘంలో విభజన బిల్లును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరచకపోవడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. ఈ కారణంగానే తమ ప్రభుత్వంలో ప్రత్యేక హోదాను ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. కొండ ప్రాంతాలకు, సరిహద్దు రాష్ట్రాలు, అధిక శాతం అడవులున్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా వస్తుందని 14వ ఆర్ధిక సంఘం చెప్పిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం హైదరాబాద్ నుండి వచ్చే ఆదయాన్ని మాత్రమే కోల్పోయినట్టు ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి మధ్య కేవలం 3 శాతం నిధుల వ్యత్యాసం మాత్రమే ఉందని, ఆ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీచేస్తుందని వెంకయ్య స్పష్టంచేశారు. రాష్ట్రానికి 22వేల కోట్ల లోటు ఉన్నట్టు 14వ ఆర్ధిక సంఘం చెప్పిందని, ఆ లోటును కూడా కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్రానికి 2 లక్షల 25వేల కోట్ల పెట్టుబడులు ఈ ఐదేళ్లలో రానున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, నిరంతరాయంగా ఎపికి సహాయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. గడచిన 13 సంవత్సరాల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ చేయలేకపోయిందని, ఈ రెండున్నర సంవత్సరాల్లో మేము చేసి చూపించామని వెంకయ్య అన్నారు.