ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ ఆదాలో ఏపి టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఇంధన, విద్యుత్ సంరక్షణ రంగంలో అత్యంత అద్భుతమైన విధానాలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాష్‌చంద్ర గార్గ్ ప్రకటించారు. ఢిల్లీలో ఇంధన సంరక్షణపై ప్రపంచ బ్యాంకు సంకలనం చేసిన నివేదికను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌కు లభిస్తుందన్నారు. రాజకీయ సంకల్పం, దార్శనికతతో కూడిన నాయకత్వం, ఫలితాలు ఇచ్చే పథకాల అమలులో ముందు చూపు ఉన్న పరిపాలనాదక్షుడు చంద్రబాబు వల్లనే ఇంధన పొదుపులో మంచి లక్ష్యాలు సాధించారని ఆయన ప్రశంసించారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు విధానాల వల్ల సాలీనా 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసిందని, ఇది సామాన్యమైన విజయం కాదన్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఇంధన పొదుపుకోసం రాష్ట్రప్రభుత్వం రూపొందించిన రోడ్‌మ్యాప్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, విశాఖలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికను వివరించారు. ఎల్‌ఇడి బల్బుల పంపిణీకి విశిష్ట ప్రచారం చేశామన్నారు. అలాగే ఏసి, రిఫ్రిజరేటర్లు, ఫ్యాన్లను వినియోగించే విధానంలో నాణ్యమైన పద్ధతులను ఆచరించడం వల్ల ఇంధన పొదుపు సాధ్యమైందన్నారు. ఇంధన పొదుపులో దేశం మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ 42.01 స్కోరుతో అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి బల్బుల పంపిణీకి అనుసరించిన విధానాలు, వ్యవసాయ పంపుసెట్లలో నాణ్యమైన యంత్రాలను అమర్చడంలో చేపట్టిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంధన సంరక్షణ సంఘం సిఇవో ఎ చంద్రశేఖరరెడ్డి, ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎండి సౌరభ్ కుమార్, ప్రపంచ బ్యాంకు విద్యుత్ నిపుణులు సిమోన్ స్టాల్ప్ పాల్గొన్నారు.