ఆంధ్రప్రదేశ్‌

ఇంజినీరింగ్ కాలేజీలో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, మార్చి 28: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో మెకానికల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ధనరాజ్ (21) మృతి చెందాడు. ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు, కళాశాల సిబ్బంది తెలిపిన వివరాలు.. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన జ్యోతి కుమారుడు ధనరాజ్, నగరంలోని రెండవ రోడ్డుకు చెందిన వంశీరెడ్డి ఎస్.ఆర్.ఐ.టి కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. కళాశాలలో ఫేర్‌వెల్ డే నిర్వహించేందుకు వంశీరెడ్డితో పాటు మరికొందరు కలిసి విద్యార్థుల నుంచి నగదు వసూలు చేశారు. ఆ క్రమంలో సోమవారం ధనరాజ్‌ను కూడా డబ్బులు అడగగా వంశీరెడ్డి, ధనరాజ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలోనే లెక్చరర్ రావడంతో అందరూ తరగతి గదిలోకి వెళ్లారు. అయితే లెక్చరర్ బయటకు వెళ్లగానే మళ్లీ వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ గొడవలో వంశీరెడ్డి సినీ ఫక్కీలో తన బూట్ కాలుతో తన్నడంతో ధన్‌రాజ్ బల్లలపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది వెంటనే ధన్‌రాజ్‌ను అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.