ఆంధ్రప్రదేశ్‌

బ్రాండిక్స్ కంపెనీకి ఇచ్చిన 700 ఎకరాలు వెనక్కి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్ల మండలాలల్లో ఎపిఐఐసి మెసర్స్ బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీకి కేటాయించిన భూమిలోని 700 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బిజెపి శాసనసభ్యుడు పెనె్మత్స విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని సభ్యుడు లేవనెత్తారు. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, పారిశ్రామికీకరణకు చేయూతనందించేందుకు కారు చౌకగా వెయ్యి ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ కంపెనీ అనుకున్నంతగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉన్నవారికి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని సభ్యుడు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కొంత భూమిలో భవనాలు నిర్మించారు తప్ప మిగిలిన 700 ఎకరాల వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా ఆ భూమిని వేరే వాళ్లకు లీజుకు ఇచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎకరానికి ఒక్క రూపాయి కౌలుగా నిర్ణయించి అప్పగిస్తే బ్రాండిక్స్ కంపెనీ మాత్రం ఏడాదికి రూ.35 లక్షలకు పైగా లీజుకు ఇచ్చుకుని లబ్ది పొందుతోందని తెలిపారు.