ఆంధ్రప్రదేశ్‌

నేడు టిడిపి ఆవిర్భావ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నాడు జరగనుంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరగనున్నాయి. మార్చి 29 నాటికి సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఇదే రోజున నందమూరి తారక రామారావు నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం 8 గంటలకు పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. 8.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు.

నేడు పెమాండు ల్యాబ్‌ను
సందర్శించనున్న సిఎం బాబు
హైదరాబాద్, మార్చి 28: మలేషియాను స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వ సరికొత్త పాలన విధానం ‘పెమాండు’ (పెర్‌ఫార్మెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ డెలివరీ యూనిట్)పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్షించనున్నారు. హైదరాబాద్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఎపి ప్రణాళికా విభాగం ఏర్పాటు చేసిన పెమాండు ల్యాబ్‌ను సిఎం సందర్శిస్తారు. ఈ విధానం లోతుపాతులను, అమలుజరుగుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. పెమాండు ల్యాబ్స్‌లో ప్రణాళిక విభాగం సిద్ధం చేసిన ఆరు వర్కు స్ట్రీమ్స్ ఫలితాలపై కూడా సిఎం సమగ్రంగా అధ్యయనం చేస్తారు.