ఆంధ్రప్రదేశ్‌

బీచ్ ఫెస్టివల్‌పై అసత్య ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, నవంబర్ 6: బీచ్ ఫెస్టివల్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన బూటకపు ఆరోపణలు మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పలు వార్డుల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. బీచ్ ఫెస్టివల్‌కు ఎటువంటి అనుమతులు ఇంకా ఇవ్వలేదని, పరిశీలనలోనే ఉందని, ఈ విషయం తెలియకుండా రాష్ట్ర ప్రజలను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ అంశంపై ముఖ్యమంత్రి, క్యాబినెట్‌లో చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఉద్ఘాటించారు. కారంపొడి పరిశ్రమలపై విజిలెన్సు దాడులు జరుగుతున్నాయని, కల్తీ కారం ఎక్కడైనా తయారు చేస్తే ఆయా కేంద్రాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రత్యేకహోదా కోసం విశాఖలో సభలు నిర్వహించడం మాని, ధమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం ఎదుట నిర్వహించాలని సవాల్ చేశారు. నకిలీ విత్తనాల కేంద్రాలపై పిడి యాక్టులు పెడుతున్నామన్నారు. వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని సస్పెండ్ చేశామని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పుల్లారావు తెలిపారు.