ఆంధ్రప్రదేశ్‌

ఆరు బిల్లులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28 : ఎపి ప్రభుత్వం ప్రతిపాదించన ఆరు బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో విసి నియామకం, పదవీకాలం పొడిగింపు, విద్యార్థుల సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి తరఫున ఆర్థిక మంత్రి యనమల ప్రతిపాదించగా సభ ఆమోదించింది. ఎపిఇఆర్‌సి చైర్మన్, సభ్యుల నియామకం, వారి వయోపరిమితికి సంబంధించి సిఎం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించి విద్యుత్ చట్టం సవరణ బిల్లుకు కూడా ఆమోదించింది. భూమి హక్కులు, పట్టేదార్ పాస్‌పుస్తకాల చట్టం సవరణ బిల్లును ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ప్రతిపాదించగా ఆమోదం లభించింది. గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణను 58 ఏళ్ల నుండి 60 సంవత్సరాల వరకు పెంచుతూ గ్రంథాలయాల చట్టంలో సవరణ చేస్తూ ప్రతిపాదించిన బిల్లును కూడా సభ ఆమోదించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌లో చైర్మన్, సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు తదితరుల నియామకానికి సంబంధించి ఎపి ఇంటర్‌మీడియట్ విద్యాచట్టం సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. అటవీ దొంగలు, స్మగ్లర్లపై ఉక్కుపాదంమోపేందుకు వీలుగా అటవీ చట్టంలో సవరణ చేస్తూ ప్రతిపాదించిన బిల్లును కూడా సభ ఆమోదించింది. ఇలా ఉండగా ఇంధనం, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బిసి వెల్ఫేర్, మైనారిటి, మహిళా శిశు సంక్షేమం, పంచాయితీరాజ్ తదితర శాఖలకు సంబంధించిన గ్రాంట్లకు సభ ఆమోదం తెలిపింది.