ఆంధ్రప్రదేశ్‌

ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, మార్చి 29: శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం మండలంలోని రుగడ, కొమనాపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లోకి చొరబడిన ఏనుగుల గుంపు అలజడి రేపాయి. తోటలు, ఇళ్లు ధ్వంసం చేయడంతో గిరిజనులు భీతిల్లారు. గుంపుగా వచ్చిన ఏనుగులు ఎగువ రుగడ, ఈతలగూడ గ్రామాల్లోని లక్ష్మణరావు, ధర్మారావు, రాజేశ్వరరావు, తోటయ్యకు చెందిన ఇళ్లను ధ్వంసం చేశాయి. అలాగే కొమనాపల్లికాలనీలో గంగన్న, అప్పారావుకు చెందిన వంటశాలలను నేలమట్టం చేశాయి. గ్రామాల సమీపంలోని వెదురు, అరటి తోటలను నాశనం చేశాయి. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించటంతో రక్షణ కోసం గిరిజనులు మంటలు వేసుకుని రాత్రంతా కినుకుతీయకుండా జాగారం చేశారు.

ఏసిబి వలలో ఆర్‌ఐ
బ్రహ్మసముద్రం, మార్చి 29 : అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఓ రైతు నుంచి ఆర్‌ఐ వెంకటేశులు రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసిబి డిఎస్‌పి భాస్కర్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు.. శెట్టూరు మండల పరిధిలోని బసంపల్లి గ్రామానికి చెందిన రైతు అమరవీరారెడ్డి, అతడి సోదరులు లింగారెడ్డి, జయరాములు కలిసి ఎస్.కొండాపురం గ్రామంలోని వారి సమీప బంధువైన గంగమ్మకు చెందిన 3.18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. వీరు 2016 జనవరి 4వ తేదీ కళ్యాణదుర్గం మీ-సేవా కేంద్రంలో పట్టాదారు, టైటిల్ డీడ్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వాటి కోసం బ్రహ్మసముద్రం మండలం ఆర్‌ఐ వెంకటేసులును సంప్రదించగా ఆర్‌ఐ రూ. 6 వేలు లంచం డిమాండ్ చేశాడు.