కృష్ణ

అరుపదుల నిరంతర శ్రామికుడు ‘చంద్రబాబు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 10: ఆరు పదుల వయస్సులో కూడా రాష్ట్భ్రావృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టిడిపి యువ నేత నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతోనే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సమర్ధవంతమైన పాలన సాగిస్తున్నారన్నారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం నారా లోకేష్ పర్యటించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ఒక్క బందరు పట్టణంలోనే నారా లోకేష్ జన చైతన్య యాత్ర ద్వారా గడిచిన రెండున్నర యేళ్ళల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జిల్లా కోర్టు సెంటరులో నూతనంగా నిర్మించిన రెవెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం, కోనేరుసెంటరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి లోకేష్ ప్రసంగం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథాన నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్ళు కష్టపడుతుంటే బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత జగన్ మాత్రం అభివృద్ధి నిరోధకశక్తిగా మారుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినా దాన్ని అడ్డుకునేందుకు ప్రజల్లో లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా రాజధాని నిర్మాణంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు, కాకినాడలో ఫుడ్ పార్క్, బందరులో పోర్టు ఇలా అన్నింటికీ అడ్డు పడుతున్నారని విరుచుకుపడ్డారు. తన స్వార్ధ రాజకీయాల కోసం జగన్ ఎన్ని వేషాలు వేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సహకారంతో రాష్ట్భ్రావృద్ధికి పాటు పడుతున్నారన్నారు. బందరు పోర్టు విషయంలో కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, పోర్టును నిర్మించి తీరుతామన్నారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే బందరు నుండి బెల్ కంపెనీ తరలిపోతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. బందరులో బెల్ కంపెనీ కొనసాగుతుందని, దీనికి అదనంగా నిమ్మలూరులో మరో ప్రాజెక్టు నిర్మితమవుతుందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. గడిచిన రెండేళ్ళల్లో కార్యకర్తల సంక్షేమానికి రూ.12కోట్లు ఖర్చు చేసి 4వేల మందికి లబ్ధి చేకూర్చామన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ధీమా కల్పించేందుకు గాను ప్రమాద బీమాను వర్తింప చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్తల కుటుంబానికి రూ.2లక్షలు చొప్పున బీమా మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీలు వైవిబి రాజేంద్ర ప్రసాద్, ఎఎస్ రామకృష్ణ, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.