ఆంధ్రప్రదేశ్‌

చెక్‌డ్యాంలో పడి తల్లీకూతుళ్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబుళదేవరచెరువు, మార్చి 29:బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ చెక్‌డ్యాంలో పడి తల్లీకూతుళ్లు మృతి చెందిన సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువులో చోటుచేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఓబుళదేవరచెరువులోని మహ్మదాబాద్ క్రాస్‌కు చెందిన ఆదినారాయణ తన భార్య శారదలక్ష్మినరసమ్మ(45), కుమార్తె పార్వతి(20)లను బట్టలు ఉతికేందుకు ఉదయం తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి రెడ్డిపల్లి వద్ద ఉన్న చెక్ డ్యామ్ వద్ద వదలేసి వచ్చాడు. అయితే వారు ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో చెక్ డ్యామ్ వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ బట్టలు మాత్రమే ఉన్నాయి కానీ భార్య, కుమార్తె కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి చెక్‌డ్యాం చెక్‌డ్యాంలోకి దిగి పరిశీలించగా అప్పటికే తల్లీకూతురు మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే కదిరి డీఎస్పీ వెంకటరామాంజినేయులు, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి శవాలను బయటకు తీయించారు. అలాగే పోస్టుమార్టం కోసం మృతదేహాలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్రీడా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ (స్పోర్ట్స్), మార్చి 29: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ 2016 సంవత్సరానికి వివిధ క్రీడాంశాల్లో అర్హులైన అభ్యర్థులకు అవార్డులను బహూకరించడానికి అత్యుత్తమమైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ జి రేఖారాణి తెలిపారు. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహం పురస్కార్, రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కార్, ధ్యాన్‌చంద్ పురస్కార్, ద్రోణాచార్య పురస్కార్, అర్జున పురస్కార్‌లను ఇవ్వడానికి దరఖాస్తులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. వైఎఎస్.ఎన్‌ఐసి.ఇన్ వైబ్‌సైట్ నుండి దరఖాస్తులను పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 12వ తేదీ లోపు హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ కార్యాలయంలో అందజేయాలని రేఖారాణి పేర్కొన్నారు.

ఆడిట్ అభ్యంతరాలను తగ్గిస్తున్నాం:టిటిడి ఇవో
తిరుమల, మార్చి 29: టిటిడిలోని అన్ని విభాగాలకు సంబంధించిన వంద కోట్ల ఆడిట్ అభ్యంతరాలను ప్రస్తుతం రూ.14 కోట్లకు తగ్గించగలిగామని టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు చెప్పారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ఉన్నతాధికారులతో ఇ ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు టిటిడి ఆడిట్ అభ్యంతరాలపై చేసిన వ్యాఖ్యలను విలేఖరులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. పాత లెక్కలకు సంబంధించి రూ.60కోట్లు ఆడిట్ అభ్యంతరాలున్నాయని వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. టిటిడికి సంబంధించిన ప్రతి రూపాయికి ఆడిట్ చేయిస్తామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టిటిడి అంతర్గత ఆడిట్ కూడా జరుగుతోందని అన్నారు. టిటిడి సమర్పించిన ఆడిట్‌లో పొరబాట్లు ఉంటే వాటిని ప్రశ్నించే హక్కు స్టేట్ ఆడిట్‌కు ఉంటుందని చెప్పారు.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి
చింతూరు/్భద్రాచలం, మార్చి 29: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణపూర్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపిన వివరాల ప్రకారం డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్, డిస్ట్రిక్ట్ ఫోర్స్ సంయుక్తంగా దౌడాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సులింగ, తిరకానార్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఆ సమయంలో పోలీస్ బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని, అలాగే నలుగురైదుగురు గాయాలపాలై ఉండొచ్చని ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. సంఘటనా స్థలంలో ఒక ఇన్‌సాస్ రైఫిల్, 315 తుపాకీ, 12 బోర్ తుపాకీ లభ్యమైనట్టు ఎస్పీ తెలిపారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.