ఆంధ్రప్రదేశ్‌

లంక భూముల్లో సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 29: రాజధాని అమరావతి పరిధిలోని లంకభూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించారు. కేంద్ర రాజధాని ప్రాంతంలో లంక భూములకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు తమ భూములు ఇచ్చిన ప్రదేశంలోనే స్థలాల కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరు మండలంలోని రాయపూడి, వెంకటపాలెం గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన లింగాయపాలెం, మందడం గ్రామాల్లో సర్వే పూర్తయిన తరువాత రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు.
రైతులు అభ్యంతరాలు తెలియజేసేందుకు నెల రోజుల గడువుఇస్తారు. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత ఇప్పటికే రాజధాని నిర్మాణాలకు భూములిచ్చిన రైతులను గుర్తించి ప్యాకేజి అమలు చేస్తారు. రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించిన తరువాత సంబంధిత వివరాలను సిఆర్‌డిఎ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం రైతుల వివరాలతో కూడిన సమాచారాన్ని ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రకటిస్తారు. రాజధాని పరిధిలోని లంకల్లో సుమారు 2 వేల ఎకరాల వరకు భూములు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలను, వాటి డాక్యుమెంట్లను రైతుల నుంచి రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు.
రైతుల వివరాలను సిఆర్‌డిఎ అధికారులకు అందజేసిన తరువాత రెవెన్యూ సిబ్బంది నిర్ణయించిన ప్రకారం నిజమైన లబ్ధిదారులకు కౌలుపరిహార చెల్లింపులు ప్రారంభమవుతాయి. కేంద్ర రాజధాని ప్రాంతమైన వెంకటపాలెం, లింగాయపాలెంలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాయపూడి, మందడం కేంద్రంగా నిర్మాణం కానున్నాయి. ప్రభుత్వం తొలి దశలో అంగీకరించక పోయినప్పటికీ రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు అంగీకరించింది.

రాజధానిలో సామాజిక, ఆర్థిక గణన
గుంటూరు, మార్చి 29: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ప్రతిపాదించిన ప్రాంతంలో సామాజిక ఆర్థిక సర్వేను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని నగర పరిధిని మినహాయించి, రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలూ సిఆర్‌డిఎ పరిధిలో ఉన్నాయి. మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, గుంటూరు-1, 2, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని ప్రజల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు సర్వే చేపట్టారు. గుంటూరు, కృష్ణాజిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో సర్వే పూర్తి అయిన తరువాత ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న జనాభా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సామాజిక ఆర్థిక సర్వే మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. సర్వే ఫలితాలను అనుసరించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సామాజిక సర్వే ద్వారా గుర్తించిన వారికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది.