ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 29: దళారుల బెడద లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మీ సేవ కేంద్రాల వ్యవస్థలో కూడా అర్బన్ ప్రాంతాల ప్రజల దరఖాస్తులు అధిక సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సుమారు 24వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు మీ సేవ వెబ్‌సైట్‌లో కనిపిస్తుండటంతో ఈ కేంద్రాల లక్ష్యం దెబ్బతింటోందన్న అభిప్రాయానికి వచ్చిన రాష్ట్ర పురపాలకశాఖ ఈ అంశంపై కాస్తంత సీరియస్‌గానే దృష్టిపెట్టింది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుచేసుకుంటే నిర్ణీత గడువులో ఎవరి ప్రమేయం లేకుండా తమ దరఖాస్తులు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తుంటారు. కానీ 2014 జూన్ నుండి ఈ ఏడాది మార్చి వరకు ఉన్న వివరాలను పరిశీలిస్తే సుమారు 24 వేల దరఖాస్తులు గడువు దాటిన తరువాత కూడా పరిష్కారం కాకుండా మిగిలి ఉండటంతో పురపాలకశాఖ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు సంబంధించి సాధారణంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పుట్టిన పిల్లలకు నామకరణం చేసిన తరువాత ధ్రువీకరణపత్రంలో చేర్చటం, ధ్రువీకరణపత్రంలో మార్పులు, చేర్పులు, ట్రేడ్ లైసెన్సులు, తాగునీటి కనెక్షన్ల దరఖాస్తులు తదితర 12కార్యక్రమాలు మీసేవ కేంద్రాల జరుగుతాయి. ప్రజలు దరఖాస్తు చేసుకున్న తరువాత నిర్ణీత గడువులో ఈ దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. కానీ చాలా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను గడువు లోపల పరిష్కరించటంలో విఫలమవుతున్నట్టు గుర్తించారు. దాంతో సంబంధిత మున్సిపల్ కమిషనర్లను ఈ వైఫల్యంపై వివరణ కోరుతూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎందుకు పరిష్కరించలేదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. గడువు లోపల వివరణ ఇవ్వని కమిషనర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా పురపాలక శాఖ హెచ్చరించింది.