ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి మరోసారి స్విస్ చాలెంజ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 20: రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మరోసారి స్విస్ ఛాలెంజితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టులో ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రా సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన అనంతరం ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. అంతేకాదు పర్యావరణ అంశాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్ దాఖలు కావడంతో స్విస్‌ఛాలెంజిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల భూమిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కన్సార్టియంకు స్విస్ ఛాలెంజి పద్ధతిన అప్పగించే విధంగా ప్రాథమిక ఒప్పందం కుదిరింది. అభివృద్ధిలో సంస్థకు 52 శాతం, ప్రభుత్వానికి 49 శాతం భాగస్వామ్యం ఉండాలని బిడ్‌లలో నిర్దేశించారు. రాజధాని నగరానికి బాహ్యంగా వౌలిక వనరుల అభివృద్ధికి సంబంధించి రూ. 5వేల కోట్లను సిసిఎండిసికి కేటాయించారు. విద్యుత్, నీరు, ఇతర వనరులను ప్రభుత్వం ఉచితంగా అందించే విధంగా స్విస్‌ఛాలెంజి విధానాన్ని అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లతో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కు తగ్గింది. ఇంతకు ముందు వెయ్యి పేజీలతో స్విస్ ఛాలెంజి దరఖాస్తులను రూపొందించారు. తాజాగా అందులో స్వల్ప సవరణలు చేసినట్లు సమాచారం. మరోసారి గ్లోబల్ టెండర్లను స్విస్ ఛాలెంజి విధానంలోనే ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైంది. రాజధాని అభివృద్ధికి సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సీఆర్డియే అధికారులు తెలిపారు. అయితే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే దరఖాస్తులు ఆహ్వానించాలా? లేక గ్లోబల్ ఓపెన్ టెండర్లను స్వీకరిస్తారా అనే విషయమై ఇంకా ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేదని చెప్తున్నారు. కాగా ఇటీవల లింగాయపాలెం- రాయపూడి గ్రామాల మధ్య శంకుస్థాపన జరిగిన ప్రభుత్వ భవనాల నిర్మాణంలో భాగంగా తొలిదశలో శాసనసభ, హైకోర్టు డిజైన్లకు ఇప్పటికే సీఆర్డియే టెండర్లను పిలిచింది. ఈ నెల 23తో దరఖాస్తుల గడువు ముగియనుంది. శాసనసభను 3.28 లక్షల చదరపు అడుగులు, హైకోర్టును ఆరు లక్షల చదరపు అడుగులలో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించేందుకు డిజైన్లు రూపొందించాలని సిఆర్డీయే సూచించింది. ఇ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. దేశ, విదేశాలకు చెందిన పలు ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి దరఖాస్తులు అందినట్లు సమాచారం.