ఆంధ్రప్రదేశ్‌

ప్రాణం తీసిన చిల్లర కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, నవంబర్ 20: అనారోగ్యంతో బాధపడుతూ రూ.2వేల నోటుకు చిల్లర దొరకక సమయానికి వైద్యశాలకు వెళ్లకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన నెల్లూరి కృష్ణ (46) ఆస్మా రోగంతో బాధపపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు చిల్లర దొరకక ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ ఏలేశ్వరం వెళ్లి వైద్యశాలలో చికిత్స పొందేందుకు రూ.2వేల నోట్లు రెండింటిని (రూ.4వేలు) చిల్లర కోసం ప్రతి దుకాణానికీ వెళ్లి ప్రయత్నించాడు. అయితే అక్కడ చిల్లర లభించకపోగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రమై ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ బైకుపై నుండి పడి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిల్లర సకాలంలో లభించి ఉంటే..తమ కుటుంబాన్ని పోషించే కృష్ణ జీవించి ఉండేవాడని మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.