ఆంధ్రప్రదేశ్‌

అప్పుడూ, ఇప్పుడూ.. ప్రజలకే ఇక్కట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 20 : ప్రభుత్వాలు గతంలో, ప్రస్తుతం నోట్లు రద్దు చేసిన సందర్భాల్లో ఎక్కువగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ నల్లధనం పూర్తిస్థాయిలో బయటకు రాలేదనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని చరిత్ర కూడా స్పష్టం చేస్తుంది. మన దేశంలో నోట్ల రద్దు అనే విషయం కొత్తేమీ కాదు. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు, ఇప్పుడు నల్లకుబేరుల కంటే ప్రజలే ఎక్కువగా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎప్పుడు నోట్లు రద్దు చేసినా ఎలాగోలా తప్పించుకుంటున్న నల్లకుబేరులు అంతకంతకూ పెరుగుతున్నారు తప్పా నల్లధనం బయటకు రావడం లేదన్నది నోట్ల రద్దు చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016 నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడంతో దేశంలోని నల్లకుబేరుల గుండెల్లో గుబులు పుట్టింది. నవంబర్ 9వ తేదీ బ్యాంకులు మూతపడ్డాయి. 10వ తేదీ బ్యాంకులు తెరవడంతో నోట్ల మార్పిడికి, ఖాతాలో జమ చేయడానికి ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ప్రజలకు నోట్ల కష్టాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తీరలేదు.
దేశంలో నోట్ల రద్దు 1946 నుంచి ప్రారంభమైంది. 1946లో బ్రిటీష్ ప్రభుత్వం రూ. 1000, రూ. 10,000 నోట్లను ఉపసంహరించారు. 1954లో రూ. 1000, రూ. 5,000, రూ. 10,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టారు. ఈ నోట్లను 1978 జనవరి 17వ తేదీ(సోమవారం) అర్ధరాత్రి ఆనాటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 1978 జనవరి 18వ తేదీ(మంగళవారం) బ్యాంకులకు, ట్రెజరీలకు సెలవు ప్రకటించారు. మరుసటి రోజు నుంచి నోట్లను మార్పిడి చేసుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించారు. 1978 జనవరి 19వ తేదీ నోట్లను మార్చుకోవడానికి ప్రజలు ఇప్పుడు మాదిరిగానే గతంలో కూడా బ్యాంకుల వద్ద బారులు తీరి ఇబ్బందులు పడుతూ నోట్లను మార్చుకున్నారు. అయితే అంతకుముందు 1970లో నల్లధనం వెలికి తీయడానికి వాంచు కమిటీ కొన్ని సూచనలను చేసి పెద్దనోట్లను ఉపసంహరించాలని సూచన చేసింది. అయినా అప్పటి ప్రభుత్వం వాంచు కమిటీ సూచనలను అమలుచేయలేదు. అప్పటికే చాలా మంది నల్లధనం దాచిన వారు ఉప సంహరించిన నోట్లను మార్చుకున్నారు. 1978లో ఆ నాటి జనతా ప్రభుత్వం రూ. 1000, రూ. 5000, రూ. 10,000 నోట్లను రద్దు చేసింది. రద్దు చేసిన నోట్లను మార్చుకోవడానికి అప్పుడు కూడా ప్రజలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఇక 1946లో బ్రిటీష్ ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ విలువ రూ. 1,230కోట్లు కాగా అందులో రూ. 140కోట్లు పెద్దనోట్లు, రూ. 1,080 కోట్లు చిన్న నోట్లు ఉన్నాయి. 1978లో రద్దు చేసిన రూ. 1000 దేశ కరెన్సీలో రూ. 9,50 కోట్లు అంటే 1.6 శాతం పెద్దనోట్లు, రూ. 146కోట్లు పెద్దనోట్లు కాగా రూ. 9,006వేల కోట్లు చిన్ననోట్లు ఉన్నాయి. 2016లో రద్దు చేసిన రూ. 500నోట్ల విలువ రూ. 8.25 లక్షల కోట్లు, రూ. 1000 నోట్ల విలువ రూ. 6.7 లక్షల కోట్లు అంటే పెద్దనోట్లు విలువ 84శాతం కాగా మిగిలినవి చిన్న నోట్లు ఉన్నాయి. 1978లో జనతా ప్రభుత్వం ఆయా నోట్లు రద్దు చేసినప్పుడు ఆనాడు ఉన్న జనాభా, పరిశ్రమలు, వ్యాపారాలకు పెనుభారంగానే ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. నోట్లను రద్దు చేస్తే నల్లకుబేరుల ఆట కట్టించవచ్చని 1970లో వాంచు కమిటీ పేర్కొంది. 1978లో జనతా పార్టీ నోట్లను రద్దు చేసినా అక్రమాలు, నల్లకుబేరులు తగ్గకపోగా పెరిగారు. 2016 సంవత్సరం వచ్చినా దేశంలో ఎలాంటి మార్పులేదు. నల్లకుబేరులు నాలుగింతలు పెరిగిపోయారు. నల్లధనం రూపంలో రూ. 1000, రూ. 500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రధాని మోదీ ఆయా నోట్లను రద్దు చేశారు. రద్దు చేసి ఇప్పటికీ 10రోజులు దాటినా రిజర్వు బ్యాంకు అందించిన సమాచారం మేరకు రూ. 4 లక్షల కోట్లు మాత్రమే రద్దు చేసిన నోట్లు జమ చేసినట్లు సమాచారం.
అప్పుడు, ఇప్పుడు కూడా నోట్లు రద్దు చేసినప్పుడు సామాన్య, మధ్య తరగతి, చిరు ఉద్యోగులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు మాత్రమే తమ వద్ద ఉన్న సొమ్మును, దాచుకున్న నగదును వెంటనే బ్యాంకులో జమ చేయడానికి ముందుకు వచ్చారు. ఇబ్బందులు పడుతున్నారు. కానీ అప్పుడు, ఇప్పుడు నల్లకుబేరులు దాచిన ధనాన్ని బయట పెట్టలేదు. వీలైతే కాల్చివేస్తారు. ఆర్థిక నిపుణులు, రిజర్వు బ్యాంకు అధికారుల అంచనా మేరకే 30శాతం నల్లధనం బయటకు వచ్చే ప్రసక్తేలేదని అంచనా వేస్తున్నారు. కావున నోట్ల మార్పిడితో ప్రజలకు ఇబ్బందులు తప్పా నల్లకుబేరులను అరికట్టలేకపోతున్నారనే విషయం నోట్ల రద్దు చరిత్రను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

చిత్రాలు..1978లో రద్దు చేసిన నోట్లను లెక్కిస్తున్న బ్యాంకు అధికారులు, అప్పట్లో నోట్ల మార్పిడి కోసం బ్యాంకు ముందు గుమికూడిన జనం, నోట్ల మార్పిడికి క్యూలైన్‌లో నిల్చొని రద్దయన పెద్ద నోటును చూపిస్తున్న ఒక వ్యక్తి