ఆంధ్రప్రదేశ్‌

పిహెచ్‌సిలకు దంత వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 21: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలలో దంత వైద్యులను త్వరలో నియమిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సోమవారం నారాయణ డెంటల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.దంత వైద్యం పట్ల ప్రజలలో అంత అవగాహన లేదని, దంత వైద్యం గురించి గ్రామీణులకు తెలియజేయాలని ఆయన కోరారు. అంతకుముందు మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో శానిటేషన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు చిత్తశుద్ధితో విధి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. సమాచారం ఇవ్వకుండా ఆందోళనలు నిర్వహించిన చంద్రన్న సంచార వైద్యశాల (104) సిబ్బందిని వెంటనే విధుల్లో నుండి తొలగించాలని జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 5.25కోట్లతో నిర్మించిన శ్వాసకోశ వైద్యశాల, 1.25కోట్లతో ఎసి మార్చురీని ఆయన పురపాలక శాఖామంత్రి నారాయణతో కలసి ప్రారంభించారు.