ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎంపిటిసి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, నవంబర్ 21: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మండలంలోని గడికోట గ్రామ మాజీ ఎంపిటిసి దోనపాటి రమణ (40)ను ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని వరి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు మెడ, గొంతుపై నరికి దారుణంగా హత్య చేశారు. దోనపాటి రమణ ఆదివారం రాత్రి గ్రామ శివారులోని సగిలేరు వాగు సమీపంలోగల వరి పొలానికి నీరు కట్టేందుకు వెళ్ళాడు. అయితే సోమవారం ఉదయం వరకు రమణ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన భార్య సుజాత రమణతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పందించకపోవడంతో ఉద యం 8.30గంటల సమయంలో పొలం వద్దకు వెళ్ళి చూడగా రమణ మృతదేహం కనిపించడంతో బోరున విలపిస్తూ గ్రామంలోకి పరుగులు తీసి బంధువులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.