ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో కాన్సులేట్ ఆఫీసు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: అమరావతిలో యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ బృందానికి ఎపి సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ బృందం సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఈసందర్భంగా హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌కు కాన్సుల్ జనరల్‌గా ఇటీవల నియమితులైన క్యాథరీన్ బి.హడ్డాతో శ్రీ్ధర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతి నగర ప్రణాళిక, అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. అమరావతి కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధానికి అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలు తరలివచ్చేలా తగిన సహకారం అందించాలని కోరారు. హడ్డా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు, తగిన సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బిజినెస్ చాంబర్‌తో కలిసి పెట్టుబడులు రావడానికి సహకరిస్తామన్నారు. అమెరికన్ బృందంలో యుఎస్ కాన్సులేట్ జనరల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆఫీసర్ పీటర్ మెక్‌షర్రీ, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్పెషలిస్టు సిబా ప్రసాద త్రిపాఠీ, కమర్షియల్ అసిస్టెంట్ అనె్నట్టి డిసిల్వా, సిఆర్‌డిఏ ఎకనామిక్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
50 కోట్లు అందచేసిన ఎస్‌ఆర్‌ఎం వర్శిటీ
సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్‌ను ఎస్‌ఆర్‌ఎం వర్శిటీ ప్రతినిధులు కలిసి 50కోట్ల రూపాయల డిడిని సోమవారం అందచేశారు. రాజధాని పరిధిలో నీరుకొండ వద్ద ఆ వర్శిటీకి 200 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం తెలిసిందే. తొలిదశలో కేటాయించిన 100 ఎకరాలకు ఈ మొత్తాన్ని వర్శిటీ అధ్యక్షుడు సత్యనారాయణన్, డైరెక్టర్ డాక్టర్ డి నారాయణరావు, తదితరులు అందజేశారు.

చిత్రం.. సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్‌తో చర్చిస్తున్న అమెరికా బృందం