ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌లోకి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దుద్వారా ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం, పోలవరం ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రధాన అంశాలపై తన స్పందనను వెలిబుచ్చారు. పెద్దనోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి అభిప్రాయం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మెగా ఫుడ్‌పార్కు కాలుష్యంపై రేగుతున్న వివాదం అంశాలపై ఆయన నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
పెద్దనోట్ల రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి స్పందిస్తూ దీనివల్ల ప్రజల్లో ఇబ్బంది ఉండటం వాస్తవమేనని చెప్పారు. ఇంత పెద్దనిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులు చక్కబడటానికి కొంత సమయం పడుతుందని అయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు ప్రారంభించుకోవాలని పిలుపునిచ్చారు. మొబైల్ కరెన్సీని అలవర్చుకోవాలని, ఆన్‌లైన్ ఆర్థిక కార్యకలాపాలకు అలవాటుపడాలని పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు వంటి ప్రక్రియను పూర్తి చేసుకునేలా ప్రజలంతా అలవాటు పడాలని చెప్పారు. ముందుగా పాత్రికేయులు, రాజకీయనాయకులు దీనికి శ్రీకారం చుడితే ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటువైపే మొగ్గు చూపుతుందని, ఎక్కడైనా పరిశ్రమల నుంచి కాలుష్యం వస్తున్నట్లు తేలితే అక్కడ దశలవారీగా కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమలో తణుకు వంటి ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతున్నట్లు తెలుస్తోందని, దానిని నివారించడానికి సమగ్ర కార్యాచరణను చేపడుతున్నట్లు చెప్పారు. రూ.20కోట్లు ఖర్చు అయినా కాలుష్యాన్ని మాత్రం నివారిస్తామని స్పష్టంచేశారు.

చిత్రం.. సోలార్ విద్యుత్ ప్లాంటును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు