ఆంధ్రప్రదేశ్‌

ప్రాణం తీసిన నోట్ల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, నవంబర్ 21: పెద్దనోట్ల మార్పిడి ఇబ్బందులు అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి పసిప్రాణాన్ని బలిగొన్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీలో నివాసముండే నెరుసుల నాగరాజు దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప యమునకి మూడేళ్లు. వారం క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగొచ్చారు. నాలుగు రోజులు బాగానే వున్నా శుక్రవారం చిన్నారికి మళ్లీ జ్వరమొచ్చింది. తండ్రి నాగరాజు చితిలో డబ్బులు లేకపోవడంతో నాగులవంచలోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో డ్రాచేసేందుకు వెళ్లాడు. బ్యాంక్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో తన ఖాతా నుంచి డబ్బు తీసుకోలేకపోయాడు. ఆదివారం సాయంత్రానికి బ్యాంక్ ఎటిఎం నుంచి నగదు డ్రాచేయగలిగాడు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని సోమవారం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యానికి రెండు రోజులు ఆలస్యం కావడంతో చిన్నారి పరిస్థితి విషమించి చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది. రెండు రోజులు బ్యాంకు నుంచి డబ్బు తీసుకోలేక పోవడంతో తమ కుమార్తె మృతి చెందిందని నాగరాజు కన్నీరు పెట్టుకున్నాడు. సకాలానికి చేతిలో డబ్బులుంటే తమ చిన్నారి బతికేదని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.

చిత్రం.. చిన్నారి యమున మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి